Sarkaru Vaari Paata Collections: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే యావేరేజి టాక్ వచ్చింది..కానీ అదే టాక్ తో అమెరికా నుండి అనకాపల్లి వరుకు మొదటి నాలుగు రోజులు దిమ్మ తిరిగే ఓపెనింగ్స్ ని దక్కించుకొని ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది ఈ చిత్రం..మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 32 కోట్ల రూపాయిల షేర్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపుగా 40 కోట్ల రూపాయిల షేర్ ని దక్కించుకుంది.
రెండవ రోజు 9 కోట్ల రూపాయిల షేర్, మూడవ రోజు 8 కోట్ల రూపాయిల షేర్ అలాగే నాల్గవ రోజు 9 కోట్ల రూపాయిల షేర్ ని సాధించిన ఈ చిత్రం నాలుగు రోజులకు కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలో 63 కోట్ల రూపాయిల షేర్ ని దక్కించుకోగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 75 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది..ఇక అమెరికా లో అయితే మహేష్ బాబు బ్రాండ్ పవర్ ఎలాంటిదో మరోసారి రుచి చూపించింది ఈ చిత్రం..మొదటి నాలుగు రోజులకు కలిపి ఈ సినిమా ఇక్కడ దాదాపుగా 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది..సాధారణంగా ఈ బెంచ్ మార్క్ సూపర్ హిట్ సినిమాలకు వస్తూ ఉంటాయి..కానీ మొదటి సారి ఒక్క యావరేజి సినిమాకి ఈ స్థాయి వసూలు రావడం అక్కడి ట్రేడ్ ని కూడా ఆశ్చర్యపొయ్యేలా చేసింది..ఇది ఇలా ఉండగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 120 కోట్ల రూపాయలకు జరిగింది.
Also Read: Sohail Khan-Seema Khan Divorce: ఆ స్టార్ ఇంట విడాకులు.. కారణం ఆ హీరోయినే !
మొదటి వీకెండ్ మంచి వసూళ్లను రాబట్టినప్పటికీ కూడా, సోమవారం నుండి ఈ సినిమా వసూళ్లు ఆశించిన స్థాయి లో ఉండకపోవచ్చు అని ట్రేడ్ వర్గాల అంచనా..భారీ వీకెండ్ తర్వాత సోమవారం నాడు ఈ సినిమాకి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి..ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం అని ట్రేడ్ పండితుల నుండి వినిపిస్తున్న వార్త..అదే కనుక జరిగితే ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్స్ కి దాదాపుగా 30 కోట్ల రూపాయలకు పైగానే లాస్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ట్రేడ్ వర్గాల అంచనా..30 కోట్ల రూపాయిల లాస్ అంటే చిన్న విషయం కాదు..వరుస హిట్స్ తర్వాత వచ్చిన మహేష్ బాబు మూవీ కావడం..విడుదలకి ముందు భారీ హైప్ తెచ్చుకున్న మూవీ కావడం తో మొదటి వీకెండ్ బాగానే ఉన్నప్పటికీ ఫుల్ రన్ లో మాత్రం భారీ నష్టాలు తప్పేటట్టు లేదు..మొత్తానికి మొదటి వీకెండ్ లో మంచి ఓపెనింగ్ రావడం వల్ల, డిజాస్టర్ గా నిలవాల్సిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.
Also Read:Bigg Boss Telugu OTT- Nataraj Master: బిందు తో పెట్టుకుంటే ఇంతే… బూతుల మాస్టర్ ఎలిమినేట్!
Recommended Videos: