Saripodhaa Sanivaaram Trailer: నాని నట విశ్వరూపం..ఈ సినిమాతో స్టార్ హీరోల లీగ్ లోకి చేరిపోయినట్టే!

'సరిపోదా శనివారం' థియేట్రికల్ ట్రైలర్ ని మూవీ టీం హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో అభిమానుల సమక్ష్యంలో గ్రాండ్ గా విడుదల చేసారు. యూట్యూబ్ లో కాసేపటి క్రితమే ఈ ట్రైలర్ ని అప్లోడ్ చెయ్యగా, ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

Written By: Vicky, Updated On : ఆగస్ట్ 13, 2024 9:31 సా.

Saripodhaa Sanivaaram Trailer

Follow us on

Saripodhaa Sanivaaram Trailer: విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేసే హీరోలలో ఒకరు న్యాచురల్ స్టార్ నాని. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి రావడం అనేది చిన్న విషయం కాదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, సొంత బ్రాండ్ ఇమేజి తో వంద కోట్ల రూపాయిల గ్రాస్ కొట్టే రేంజ్ కి ఎదిగిన నాని, కొత్త ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే నటులకు ఒక ఆదర్శప్రాయం. ‘దసరా’ చిత్రంతో తన పంథా పూర్తిగా మార్చిన నాని, ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నానికి ఇది రెండవ చిత్రం. గతంలో వీళ్లిద్దరు కలిసి ‘అంటే సుందరానికి’ అనే చిత్రం చేసారు.

ఇకపోతే నేడు ‘సరిపోదా శనివారం’ థియేట్రికల్ ట్రైలర్ ని మూవీ టీం హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో అభిమానుల సమక్ష్యంలో గ్రాండ్ గా విడుదల చేసారు. యూట్యూబ్ లో కాసేపటి క్రితమే ఈ ట్రైలర్ ని అప్లోడ్ చెయ్యగా, ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి సినిమా నాని మాత్రమే చెయ్యగలడు అంటూ ఈ ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్న మాట. ఇకపోతే ఈ సినిమాలో నాని పట్టరాని కోపం ఉన్న యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. చిన్నతనం నుండి ఇతని కోపాన్ని చూసి భయపడే అతని తల్లి, అతని కోపాన్ని తగ్గించేందుకు కేవలం శనివారం మాత్రమే నీ కోపాన్ని చూపించాలి అంటూ ప్రమాణం చెయ్యించుకుంటుంది. తల్లిమాటకి కట్టుబడి నాని అలాగే పెరుగుతాడు. తనకి వచ్చే కోపాన్ని మొత్తం కేవలం శనివారం మాత్రమే చూపిస్తాడు అనేది ఈ ట్రైలర్ సారాంశం. అలాంటి వ్యక్తి జీవితంలో సైకో మెంటాలిటీ ఉన్న అవినీతి పోలీస్ ఆఫీసర్ ఎస్ జె సూర్య వస్తాడు. వీళ్లిద్దరి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రం.

ఇకపోతే ఈ ట్రైలర్ లో హీరోకి తండ్రి పాత్ర పోషించిన సాయి కుమార్ చెప్పే డైలాగ్స్ బాగా పేలాయి. ‘ఇప్పటి వరకు మీరు కేవలం వాడి రెండు కళ్ళను మాత్రమే చూసారు. మూడో కన్ను తెరిచాడంటే శివ తాండవమే’ అని ఆయన చెప్పే డైలాగ్ వెనుక చాలా పెద్ద అర్థం ఉంది. ఇప్పటి వరకు మీరు అతనిలో రెండు కళ్ళు మాత్రమే చూసారు అంటే ఒక వారం లో శనివారం తప్ప మిగిలిన రోజుల్లో ఉండే హీరో ప్రవర్తన అన్నమాట. అలాగే రెండో కన్ను అనగా శనివారం రోజు కోపంగా ఉండే హీరో ప్రవర్తన. ఇవి రెండు కాకుండా మూడవ కన్ను అంటే ఏమిటి, హీరోలో దాగున్న ఆ సరికొత్త యాంగిల్ ఏంటో థియేటర్ లో చూసి తెలుసుకోవాల్సిందే. ఇలా ఆద్యంతం సినిమాపై ఆసక్తి కలిగించేలా ఉన్న ఈ ట్రైలర్ ని చూస్తుంటే నాని ఈ సినిమాతో వంద కోట్ల రూపాయిల షేర్ ని కొట్టి, స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు అనేది స్పష్టమవుతుంది.