https://oktelugu.com/

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ చిత్రంలో సరిపోని అంశాలు ఇవే..సెకండ్ హాఫ్ లో ఆ చిన్న మార్పు ఫలితాన్ని మార్చేసింది!

ఇంటర్వెల్ సన్నివేశం వేరే లెవెల్ లో వచ్చింది, ముఖ్యంగా ఫస్ట్ మొత్తాన్ని జేక్స్ బీజాయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలా నిలబెట్టేసింది అనే చెప్పాలి. ఆడియన్స్ కి ఒక సరికొత్త సౌండింగ్ ని విన్న అనుభూతి కలుగుతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : August 29, 2024 / 12:18 PM IST

    Saripodhaa Sanivaaram

    Follow us on

    Saripodhaa Sanivaaram: భారీ అంచనాల నడుమ నేడు నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘సరిపోదా శనివారం’ విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలకు ముందే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో థియేట్రికల్ ట్రైలర్ ద్వారా ఈ సినిమాకి మార్కెట్ లో మంచి బజ్ ఏర్పడింది.. దాంతో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఏకంగా 42 కోట్ల రూపాయిలకు జరిగింది. అయితే ఈ సినిమాకి 42 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉందా?, పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి వీకెండ్ వరకు ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తాయి, కానీ వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమాకి లాంగ్ రన్ ఇచ్చేంత స్టామినా ఉందా?, నాని కెరీర్ లో మరో ‘దసరా’ గా నిలుస్తుందా లేదా అనేది ఈ విశ్లేషణలో చూద్దాం. సినిమా ప్రారంభమే మంచి పాయింట్ తో మొదలు అవుతుంది, హీరో చిన్నతనంలో ఉన్నప్పుడే థియేటర్స్ షేక్ అయ్యే ఎలివేషన్ సన్నివేశాలు రెండు పడతాయి. ఇక అక్కడి నుండి స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సాగుతుంది, మధ్యలో కొన్ని సన్నివేశాలు అవసరం లేదు కదా అనిపిస్తాది, ఎస్ జె సూర్య ఎంట్రీ తర్వాత నుండి స్క్రీన్ ప్లే లో వేగం అందుకుంటుంది.

    ఇంటర్వెల్ సన్నివేశం వేరే లెవెల్ లో వచ్చింది, ముఖ్యంగా ఫస్ట్ మొత్తాన్ని జేక్స్ బీజాయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలా నిలబెట్టేసింది అనే చెప్పాలి. ఆడియన్స్ కి ఒక సరికొత్త సౌండింగ్ ని విన్న అనుభూతి కలుగుతుంది. ఇంటర్వెల్ తో సెకండ్ హాఫ్ కి కథని మంచిగా సెట్ చేసాడు డైరెక్టర్ వివేక్ ఆత్రేయా. ఇక హీరో కి విలన్ కి మధ్య పోరాట సన్నివేశాలు వేరే స్థాయిలో ఉంటుంది అని చూసే ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ ఆ స్థాయిలో సన్నివేశాలు లేకపోవడం సినిమాకి కొద్దిగా మైనస్ అయ్యింది. సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత పబ్ లో హీరో కి విలన్ మధ్య వచ్చే ఫైట్ సీన్ అదిరిపోతుంది. కానీ ఆ తర్వాత నుండి స్క్రీన్ ప్లే ఆడియన్స్ ఊహించిన విధంగానే, సాఫీగా సాగిపోతుంది. అలా కాకుండా హీరో, విలన్ కి మధ్య నువ్వా నేనా అనే తరహాలో స్క్రీన్ ప్లే ని నడిపించి ఉంటే ఈ సినిమా ఎక్కడో ఉండేది. సెంటిమెంట్ సన్నివేశాలు కూడా అనుకున్నంతగా పండలేదు.

    సెకండ్ హాఫ్ లో ఎస్ జె సూర్య నటనే సినిమాని నిలబెట్టింది అని చెప్పాలి. స్క్రీన్ ప్లే సాదాసీదాగా నడుస్తున్న సమయంలో ఎస్ జె సూర్య నటన, ఆయన పలికిన డైలాగ్స్ థియేటర్స్ లో ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించేలా చేసింది. ఈ సినిమాకి మరో మైనస్ ఏమిటంటే పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా అందించిన జేక్స్ బీజాయ్ పాటల విషయంలో మాత్రం అనుకున్న స్థాయిలో అభిమానులను అలరించలేకపోయాడు. ఓవరాల్ గా ‘సరిపోదా శనివారం’ చిత్రంలో సరిపోని అంశాలు ఇవి, వీటి మీద డైరెక్టర్ కాస్త ద్రుష్టి పెట్టి ఉంటే వంద కోట్ల రూపాయిల షేర్ ని అందుకునే సత్తా ఈ సినిమాకి ఉండేది.