https://oktelugu.com/

Devara: గూస్ బంప్స్ రేపుతున్న దేవర న్యూ పోస్టర్… రెండు పాత్రల లుక్స్ రివీల్ చూశారుగా!

దేవర విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా దేవర మూవీ నుండి విడుదలైన పోస్టర్ ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు భిన్నమైన పాత్రల్లో మెస్మరైజ్ చేయనున్నాడు. ఆ రెండు పాత్రల లుక్స్ లేటెస్ట్ పోస్టర్ లో చూడొచ్చు.

Written By:
  • S Reddy
  • , Updated On : August 27, 2024 / 02:15 PM IST

    Devara

    Follow us on

    Devara: ఎన్టీఆర్ మూవీ థియేటర్స్ లోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఆయన గత చిత్రం ఆర్ ఆర్ ఆర్ 2022 మార్చిలో విడుదలైంది. అలాగే గత ఆరేళ్లలో ఎన్టీఆర్ చేసింది ఒక సినిమా మాత్రమే. అరవింద సమేత వీర రాఘవ 2018లో విడుదల కాగా… 2022లో ఆర్ ఆర్ ఆర్ తో ఫ్యాన్స్ ని పలకరించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు కొరటాల శివతో ఆయన దేవర చేస్తున్నారు. ఈ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న విడుదల కావాల్సింది. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు.

    దాంతో అక్టోబర్ 10కి వాయిదా వేశారు. పోస్ట్ పోన్ చేసిన డేట్ ని ప్రీ ఫోన్ చేశారు. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ సెప్టెంబర్ 27న విడుదల కావాల్సింది. రాజకీయంగా బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ లో పాల్గొనలేదు. కాబట్టి సెప్టెంబర్ 27న ఓజీ విడుదలయ్యే అవకాశం లేదు. ఆ తేదీని దేవర చిత్రానికి కేటాయించారు. మరో నెల రోజుల్లో ఓజీ థియేటర్స్ లో సందడి చేయనుంది.

    విడుదల సమయం సమీపిస్తుండగా ప్రమోషన్స్ పై మూవీ యూనిట్ దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా ఓ రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు. ఎన్టీఆర్-జాన్వీ కపూర్ కాంబోలో వచ్చిన దేవర ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ దక్కింది. సాంగ్ లో జాన్వీ కపూర్ గ్లామర్, ఎన్టీఆర్ తో కెమిస్ట్రీ బాగా కుదిరాయి. తాజాగా దేవర నుండి మరో అప్డేట్ వచ్చింది. ది ఫేసెస్ ఆఫ్ ఫియర్ అంటూ ఎన్టీఆర్ రెండు ముఖాలతో కూడిన పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ రెండు భిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నాడు.

    ఓ లుక్ లో ఆయన లాంగ్ హెయిర్ తో ఉన్నాడు. మరొక లుక్ లో షార్ట్ హెయిర్ తో ఉన్నాడు. దేవరలో ఎన్టీఆర్ తండ్రి కొడుకుల పాత్రలు చేస్తున్నాడని సమాచారం. తండ్రి పాత్ర లాంగ్ హెయిర్ తో ఉంటుందట. మొత్తంగా లేటెస్ట్ పోస్టర్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. కాగా దర్శకుడు కొరటాల శివ దేవరను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

    దేవరలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. భైర అనే క్రూరమైన విలన్ పాత్రలో ఆయన మెప్పించనున్నారు. సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే పురస్కరించుకుని విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంది. దేవర మూవీలో సైఫ్ రోల్ ఎంత భయంకరంగా ఉంటుందో ప్రోమో తెలియజేసింది. దేవర చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే..