Singer Sai Sanvid: ఆయనది ఆడగొంతు అని అవమానించారు.. ఆ గొంతు పుట్టుకతో వచ్చినందువల్ల తానేమీ చేయలేకపోయాడు.. ఎన్నో అవమానాలు భరించారు..ఒక దశలో అతనిని ‘గే’.. అన్న వారున్నారు. అయినా ఆ మాటలకు కుంగిపోకుండా తన జీవిత గమ్యాన్ని చేరాలనుకున్నాడు. అయితే ఆడ గొంతే అతనికి వరం అయ్యింది.. ఆ గొంతుతో పాటలు పాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.. ఈ గొంతు విన్న వాళ్లు ప్రముఖ సింగర్ చిత్ర పాడుతుందని అనుకున్నారు. కానీ ఆ తరువాత తెలుసుకున్నారు.. ఈ గొంతు సాయి సాన్విద్ అని. సాయిసాన్విద్ ను ఒకప్పుడు అవమానించిన వాళ్లు ఇప్పుడు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అప్పుడు హేళన చేసిన వాళ్లు ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆయన తన గొంతును ఇప్పుడు ‘సరిగమప’ కార్యక్రమంలో వినిపించబోతున్నాడు.

‘సరిగమప’లో చేరడానికి సాయి సాన్విద్ ఎన్నో కష్టాలు పడ్డాడు.. చిన్నప్పటి నుంచి పాటలంటే బాగా ఇష్టమున్న సాయి సాన్విద్ విశాఖపట్నం నగరంలో జన్మించాడు. నలుగురు సంతానంలో ఒకడైన ఆయన తల్లిదండ్రులను చిన్నప్పుడే కోల్పోయాడు. పుట్టుకతోనే ఆడ గొంతుతో మాట్లాడిన సాయి సాన్విద్ ను తల్లి ప్రోత్సహించేది. ఆయన పాటలను మెచ్చుకునేది. అయితే తల్లిదండ్రులు కాలం చేసిన తరువాత అన్నల మధ్య సాయి ఉండలేకపోయాడు. దీంతో హైదరాబాద్ కు పనికోసం వచ్చాడు. ఈ క్రమంలో కొంత చేతిలో డబ్బు తెచ్చుకున్నా అవి సరిపోలేదు. దీంతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తిండి ఖర్చుల వరకు డబ్బు సంపాదించాడు.
Also Read: ‘సరిగమప’ సింగర్ పార్వతి బయోగ్రఫీ తెలుసా..?
అయినా సాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు. అద్దె డబ్బులు చెల్లించే స్థోమత లేక బస్టాపులల్లో పడుకున్నాడు. ఆ తరువాత నిమ్స్ ఆసుపత్రిలో పేషెంట్లు విశ్రాంతి తీసుకునే గదిలో కాలం గడిపాడు. వారు ఉచితంగా పెట్టే భోజనాన్నే ఆరగించేవాడు. ఇలా కొన్ని రోజులు సాయి సాన్విద్ ను గమనించిన అక్కడి వారు పెషెంట్లకు ఇచ్చే భోజనం తిని కడుపు నింపుకుంటున్నాడని… అక్కడి సెక్యూరిటీతో మాట్లాడి నిమ్స్ లో హౌస్ కీపింగ్ జాబ్ లో చేర్పించాడు. అలా మూడు నెలల పాటు ఆస్పత్రిలో ఉంటూనే నరకం అనుభవించాడు.

తిరిగి స్వగ్రామం వెళ్లేకన్నా ఇక్కడే ఏదో ఒకటి చేయాలని సాయి సాన్విద్ తపన పడేవారు. ఇలా నిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తూనే త్యాగరాజ సభలకు హాజరయ్యేవాడు. ఈ సభల్లో కొందరి పరిచయం సాయి సాన్విద్ జీవితాన్ని మార్చేసింది. ఇలా పరిచయం అయిన కొందరు సాయి సాన్విద్ గొంతును చూసి ఆశ్చర్యపోయారు. మెల్లగా డబ్బింగ్ కార్యక్రమాలకు హాజరవుతూ తన గొంతు వినిపించాడు. అయన గొంతు విని ఎస్పీ శైలజ ఎంతో ప్రశంసించింది. అలా సరిగమప కార్యక్రమంలో సాయి సాన్విద్ అడుగుపెట్టాడు. తన ఆడగాత్రంతో అద్భుతంగా పాడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఈయన గొంతు శాపం కాదు.. వరం అని నిరూపించాడు. గీతా మాధురి టీంలో మెంబర్ అయిన సాయి సాన్విద్ ఇప్పుడు ‘సరిగమప’ షో ద్వారా వెలుగులోకి వచ్చాడు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్ – కేజీఎఫ్ 2’ ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి ?
Recommended Video: