Chiranjeevi: అభిమానులే తన మెగా బలం అని నమ్ముతారు చిరంజీవి. తాజాగా, ఓ వీరాభిమాని కుమార్తె పెళ్లికి ఆర్థికసాయం చేశారు. రాజాం కొండలరావు కి చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం. కొండలరావు కుమార్తె నీలవేణికి ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలిసిన చిరంజీవి.. తన అభిమాని కుమార్తె పెళ్లి కోసం లక్ష రూపాయలు అందజేశారు. ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు మీడియాకు వెల్లడించారు.

ఏది ఏమైనా తన వీరాభిమాని కుమార్తె పెళ్లికి చిరంజీవి ఆర్థికసాయం చేయడం గొప్ప విషయం. ఇక మెగాస్టార్ చిరంజీవితో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ఓ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్‌గా శృతిహాసన్ ఇప్పటికే ఖరారైనట్లు వార్తలు రాగా.. తాజాగా మాళవిక మోహనన్ పేరును యూనిట్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: పాతికేళ్ల విజన్‌తో కేంద్ర బడ్జెట్.. ఉపాధి కల్పనకు అగ్ర తాంబూలం
మెగాస్టార్ ప్రస్తుతం ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలతో బిజీగా ఉండగా.. బాబీ డైరెక్షన్‌లో మూవీ తర్వాత వెంకీ కుడుముల ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశముంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరు ఆచార్య సినిమా చేస్తున్నాడు. కాగా రీసెంట్ గా చిరంజీవి మరోసారి కరోనా బారిన పడ్డారు. ఎంతో కొంత మేర చిరంజీవి కారణం ఆచార్య పనులు వాయిదా పడతాయి.

కొరటాల ఎన్టీఆర్ మూవీ సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంది. ఆచార్య విడుదల చేసి ఎన్టీఆర్ మూవీ పనులు చూసుకుందాం అనుకుంటున్నా కొరటాలకు అనుకోని అవరోధాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆచార్య ఒప్పుకున్న వేళా విశేషం ఏమిటో కానీ, ప్రాజెక్ట్ కి శుభం కార్డు పడడం లేదు.
Also Read: బీజేపీకి అండగా వైసీపీ.. వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్.. ఎవరి స్ట్రాటజీ వారిదే..!
[…] Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ జోష్ లో ఉంది. ఆమెకు ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నాయి. మొత్తానికి వ్యక్తిగత ఇబ్బందులకు ఫుల్ స్టాప్ చెప్పి కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇటు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ కొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్ లు అంగీకరిస్తూ బిజీగా గడుపుతోంది. తాజాగా ప్రముఖ తమిళ కథానాయకుడు కార్తి సరసన నటించేందుకు ఆమెను సంప్రదించినట్లు కోలీవుడ్ సమాచారం. […]