Sarath Kumar Kannappa: మరో 5 రోజుల్లో మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప'(Kannappa Movie) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతుంది. సాధారణంగా మంచు కుటుంబ సభ్యుల సినిమాలు ఈమధ్య కాలం లో ఎప్పుడు వస్తున్నాయో,ఎప్పుడు వెళ్తున్నాయో కూడా జనాలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఈ హీరోలు నేటి తరం ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు తీయడం లేదు కాబట్టి. దానికి తోడు వీళ్ళు ఏమి మాట్లాడినా సోషల్ మీడియా లో ట్రోల్ కి గురి కావడం వంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే చాలా కాలం తర్వాత మంచు సినిమాకు మార్కెట్ లో బజ్ ఏర్పడింది ‘కన్నప్ప’ కే. ఈ సినిమాని ప్రకటించినప్పుడు పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రభాస్(Rebel Star Prabhas), అక్షయ్ కుమార్(Akshay Kumar),మోహన్ లాల్(Mohanlal) వంటి వారు నటిస్తున్నారని చెప్పినప్పటికీ కూడా అనవసరంగా వాళ్ళు పరువు తీసుకుంటున్నారు ఈ సినిమాని ఒప్పుకొని అని ఎగతాళి చేసిన నెటిజెన్స్ చాలా మంది ఉన్నారు.
Also Read: ఆ మహాశివుడి ఆదేశం కారణంగానే ‘కన్నప్ప’ చిత్రాన్ని చేశానంటూ మంచు విష్ణు కామెంట్స్!
కానీ ఎప్పుడైతే ఈ సినిమా నుండి ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొక్కటిగా రావడం మొదలైంది అప్పటి నుండి ఈ సినిమా పై ఆడియన్స్ లో ఉన్న అభిప్రాయం మారుతూ వచ్చింది. ముందుగా ఈ చిత్రంలోని పాటలు మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ ని చూసిన తర్వాత మంచు విష్ణు ఈ సినిమా గురించి చెప్పిన మాటలను నమ్మడం మొదలు పెట్టారు నెటిజెన్స్. అలా నెమ్మదిగా అంచనాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరు హాజరయ్యారు. ముఖ్యంగా తమిళ నటుడు శరత్ కుమార్(Sarathkumar) మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘మోహన్ బాబు గారు నాకు సొంత అన్నయ్య లాంటి వాడు. మూడు దశాబ్దాల బంధం మాది. ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటాము. ఇక మంచు విష్ణు అయితే నా కన్న కొడుకులాంటి వాడు. నేనంటే అతనికి ఎంతో గౌరవం. వీళ్లిద్దరి వల్లే నేడు కన్నప్ప ఇంత గొప్పగా తెరకెక్కింది. నేను ఈమధ్య కాలం లో బాగా గమనించింది ఏమిటంటే నేటి తరం యువత లో దేవుడిపై భక్తి, విశ్వాసం సన్నగిల్లుతుంది. అలాంటి వారు ఈ చిత్రాన్ని చూస్తే దేవుడి పై నమ్మకం పెంచుకోగలరు. ముకేశ్ కుమార్ సింగ్ అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సందర్భంగా కన్నప్ప చిత్రాన్ని చూడాలని అనుకునేవారికి ఒక్కటే చెప్తున్నాను. ఈ సినిమాని చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. దయచేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయవద్దు. మా కష్టాన్ని గుర్తించండి,ఇది దేవుడి సినిమా అని మర్చిపోకండి’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.