Today June 22 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ఆదివారం భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపారాలు ఈరోజు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ఇది భవిష్యత్తులో లాభాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో వారు తీసుకుని నిర్ణయాలను వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలనుకునేవారు ప్రణాళిక ప్రకారంగా వెళ్లాలి. అనవసర వివాదాల్లోకి తలదూర్చొద్దు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబంలో ఒకరి కారణంగా వివాదాలు తలెత్తుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఖరీదైన వస్తువులను మరమ్మతు చేయిస్తారు. ఈరోజు ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. పిల్లలకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు భాగస్వాములతో కొత్త ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు కెరీర్ కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇంటికి చుట్టాలు రావడంతో సందడిగా మారుతుంది. బడ్జెట్ కు అనుగుణంగా ఖర్చులు పెరుగుతాయి. అనుకోకుండా కొన్ని వస్తువులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. వ్యాపార సంబంధాలు పెంచుకోవడానికి ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. అయితే కొన్ని విషయాల్లో కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగులు కొత్తగా శిక్షణను పొందుతారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. బడ్జెట్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆర్థికపరమైన ప్లానింగ్ చేస్తారు. వ్యాపారులు కొత్త అవకాశాలను పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : వ్యాపారులకు కొన్ని అంతరాయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు ఏర్పడతాయి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించుకోవాలి. లేకుంటే ఆర్థికపరమైన చెక్కులు ఏర్పడతాయి. ఆస్తికి సంబంధించి సమాచారం అందుకుంటారు. కొన్ని పనులు పూర్తి చేయడానికి సాహసించాల్సి వస్తుంది. ఆదాయం వస్తున్నప్పటికీ ఖర్చులు కూడా పెరుగుతాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఆస్తి పంపకాల విషయంలో చాకచక్యంగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కొత్తగా పెట్టుబడును పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. దీర్ఘకాలికంగా దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడును పెడతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఖర్చులు పెరిగిన అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో ప్రారంభించిన పనుల నుంచి లాభాలు పొందుతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఆర్థికపరమైన డిపాజిట్లు చేస్తారు. ఉద్యోగులు అధికారుల నుంచి బహుమతులు పొందుతారు. మార్కెట్ పరిస్థితిలో మారడంతో వ్యాపారులకు కాస్త నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెడతారు. దీంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. దీంతో ఆదాయం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అక్రమంగా సంపాదించడం మానుకోవాలి . లేకుంటే భవిష్యత్తులో తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రయాణాలు చేయాల్సివస్తే ఊహించని మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈరోజు వ్యాపారులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాస్త అనారోగ్యం అనిపించినా వెంటనే తేరుకుంటారు. ఉద్యోగులు ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయం పెరుగుతుంది. విద్యార్థుల పోటీ పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.