బాలీవుడ్ హీరోయిన్స్ కి అతనే కావాలట !

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండకి హీరోయిన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంది. పైగా వాళ్ళు ఏదో చిన్నాచితకా హీరోయిన్స్ కూడా కాదు, విజయ్ ను ఇష్టపడుతున్న అందరూ పాన్ ఇండియా రేంజ్ స్టార్ డమ్ ఉన్నవాళ్ళే. ఆలియా భట్, కియారా అద్వానీ, జాన్వీ కపూర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది గతంలో విజయ్ దేవరకొండ అంటే తమకు ఇష్టం, అతని డ్రెసింగ్ స్టైల్ చాల బాగుంటుంది అంటూ విజయ్ ను పొగిడిన వాళ్ళే. ఎంతైనా విజయ్ […]

Written By: admin, Updated On : March 2, 2021 3:33 pm
Follow us on


క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండకి హీరోయిన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంది. పైగా వాళ్ళు ఏదో చిన్నాచితకా హీరోయిన్స్ కూడా కాదు, విజయ్ ను ఇష్టపడుతున్న అందరూ పాన్ ఇండియా రేంజ్ స్టార్ డమ్ ఉన్నవాళ్ళే. ఆలియా భట్, కియారా అద్వానీ, జాన్వీ కపూర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది గతంలో విజయ్ దేవరకొండ అంటే తమకు ఇష్టం, అతని డ్రెసింగ్ స్టైల్ చాల బాగుంటుంది అంటూ విజయ్ ను పొగిడిన వాళ్ళే. ఎంతైనా విజయ్ దేవరకొండకి ఫిమేల్ ఫాలోయింగ్ ఎక్కువే. విచిత్రం ఏమిటంటే ఆ విషయంలో తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ అనే తేడా లేదు.

Also Read: నటి కోరిక.. సై అంటే పవన్ కు 4వ భార్యగా వస్తుందట..!

మనోడికి అన్ని చోట్లా లేడీ అభిమానులు ఫుల్లుగా ఉన్నారు. చాలా మంది హీరోయిన్లకు అతను డ్రీం హీరో అవ్వడం ఇక్కడ విశేషం. అసలు బాలీవుడ్ స్టార్ హీరోలు చాలామంది ఉన్నా.. అక్కడి స్టార్ హీరోయిన్స్ కి విజయ్ మాత్రమే నచ్చుతున్నాడట. అయితే ఇప్పటికే కియారా అద్వానీ, జాన్వీ కపూర్, అనన్య పాండే, ఆలియా భట్ విజయ్ దేవరకొండ పై ప్రశంసల వర్షం కురిపించగా.. తాజాగా సారా అలీ ఖాన్ విజయ్ కి ఫిదా అయిపోయింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సారా మాట్లాడుతూ.. ‘విజయ్ చాల స్మార్ట్ హీరో. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాల బాగుంటుంది.

Also Read: వైల్డ్ డాగ్ః ఓటీటీ అగ్రిమెంట్‌ చింపేశారు స‌రే.. థియేట‌ర్లో టిక్కెట్లు చింపగలరా..?

తనతో కలిసి వర్క్ చేసే ఛాన్స్ వస్తే.. కచ్చితంగా చేస్తాను’ అంటూ తెలిపింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తోన్న లైగర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి. ఈ సినిమా గనుక హిట్ అయితే విజయ్ రేంజ్ మరో లెవల్ కి వెళ్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్