https://oktelugu.com/

Saptagiri: గూడుపుఠాణితో థియేటర్లలో సందడి చేయనున్న సప్తగిరి

Saptagiri: ప్రముఖ కమెడియన్ సప్తగిరి పేరు వినగానే నవ్వులు పువ్వులై పూస్తాయి. ఏ సినిమాలోనైనా అతని కామెడీ టైమింగ్ అలా ఉంటుంది.  అల్లు అర్జున్​ హీరోగా నటించిన పరుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సప్తగిరి.. ఆతర్వాత వరుసగా అనేక చిత్రాల్లో  కమెడియన్​గా అవకాశాలు దక్కించుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమకథా చిత్రం సినిమా అతని కెరీర్​కు మంచి మలుపనే చెప్పాలి. ఆ తర్వాత హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు సప్తగిరి. ఈ క్రమంలోనే ఓ వైపు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 06:21 PM IST
    Follow us on

    Saptagiri: ప్రముఖ కమెడియన్ సప్తగిరి పేరు వినగానే నవ్వులు పువ్వులై పూస్తాయి. ఏ సినిమాలోనైనా అతని కామెడీ టైమింగ్ అలా ఉంటుంది.  అల్లు అర్జున్​ హీరోగా నటించిన పరుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సప్తగిరి.. ఆతర్వాత వరుసగా అనేక చిత్రాల్లో  కమెడియన్​గా అవకాశాలు దక్కించుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమకథా చిత్రం సినిమా అతని కెరీర్​కు మంచి మలుపనే చెప్పాలి.

    ఆ తర్వాత హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు సప్తగిరి. ఈ క్రమంలోనే ఓ వైపు కమెడియిన్​గా నటిస్తూనే.. మరోవైపు హీరోగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా, సప్తగిరి హీరోగా నటిస్తోన్న సినిమా గూడుపుఠాణి. గతంలో సూపర్​ స్టార్ కృష్ణ ఇదేే పేరుతో ఓ సూపర్ హిట్​ మూవీ తెరకెక్కించారు. తాజాగా ఇదే టైటిల్​తో సప్తగిరి సినిమా తీస్తున్నారు. ఇందులో హీరోయిన్​గా నేహా సోలంకి కనిపించనుంది.

    కే.ఎం. కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస్​ రెడ్డి, రమేశ్​ యాదవ్​ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రముఖ గాయకుడు, దర్శకుడు రఘు కుంటె విలన్​గా నటించారు.  ఓ గుడిలో బంధీలైన హీరోహీరోయిన్లు అందులోంచి ఎలా బయటపడ్డారు?.. వారిన గుడిలో బంధించాల్సిన అవసరం ఎవరకొచ్చింది.  అనే అంశంతో ఈ సినిమా తెరకెక్కింది. యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సినిమా  కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు కుమార్ తెలిపారు.