Site icon OkTelugu

Rajamouli: రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. సక్సెస్ లేదు, అప్పుడు తిట్టారు !

Rajamouli: రాజమౌళి విజయ రహస్యం తెలుసుకోవాలని ప్రతి సినిమా వాడికి ఆశ ఉంటుంది. కానీ, తన విజయ్ రహస్యం పై అసలు రాజమౌళి మరోలా మాట్లాడాడు. రాజమౌళి మాటల్లోనే.. ‘నేనెప్పుడూ విజయం సాధించానని భావించలేదు, ప్రతి చిత్రాన్ని నా మొదటి ప్రాజెక్ట్‌లానే అనుకుంటాను. మెయిన్ గా నేను ఏదైతే కథ అనుకుంటానో.. ఆ కథకు తగ్గట్టు హీరోహీరోయిన్లను ఎంచుకుంటాను.

Rajamouli

ఒకవిధంగా అదే నా బలం కూడా. ఈ సినిమా విషయానికొస్తే కొమురం భీంగా ఎన్టీఆర్ మాత్రమే బాగా చేయగలడు. అలాగే అల్లూరి సీతారామరాజుగా చరణ్ బాగా సూట్ అవుతాడు. ఇలా నేను నా పాత్రల కోసం సరైన నటులను ఎంచుకుని సినిమా చేస్తాను. అప్పుడు సహజంగానే సినిమా బాగా వస్తోంది అంటూ రాజమౌళి తాజాగా కన్నడ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

అయితే, ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాజమౌళి మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓ మీడియా ప్రతినిధి ప్రశ్న అడుగుతూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని కన్నడలో డబ్బింగ్‌ చేసినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ? అని అడిగాడు. అయితే, రాజమౌళి ‘బాహుబలి’ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమాను నేను కేవలం తెలుగు, తమిళంలోనే షూట్ చేశాను.

Also Read: కోలీవుడ్​లో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న మంచు విష్ణు

ఇక హిందీ, మలయాళంలో డబ్‌ చేశాము. అయితే, బాహుబలిని కన్నడలో డబ్‌ చేయలేదని నన్ను అప్పుడు చాలామంది తిట్టారు. నా పై ఆ సమయంలో కన్నడ సోషల్‌మీడియాలో బాగా నెగెటివ్‌ గా మాట్లాడారు. ‘నువ్వు అన్ని భాషలకు ప్రాముఖ్యత ఇచ్చి.. మా కన్నడ వాళ్లని మాత్రం చులకనగా చూస్తావా ? అంటూ సీరియస్ అయ్యారు అని రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అలాగే రాజమౌళి ఇంకా మాట్లాడుతూ.. ‘నిజానికి నేను బాహుబలిని కన్నడలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాను. కానీ ఆ సమయంలో కన్నడలో ఉన్న రూల్స్‌ ప్రకారమే మేము అప్పుడు ‘బాహుబలి’ని డబ్‌ చేయలేకపోయాము. కాకపోతే అదృష్టం బాగుండి, ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని మాత్రం కన్నడలో డబ్‌ చేసే అవకాశం వచ్చింది’ అని జక్కన్న చెప్పుకొచ్చాడు

Also Read: ఓ ఇంటివాడు కాబోతున్న ప్రభాస్​.. ఆ ప్రాంతంలో కోటలాంటి భవన నిర్మాణానికి ఏర్పాట్లు?

Exit mobile version