https://oktelugu.com/

సక్సెస్ లేని డైరెక్టర్ కు ఇగో ఎందుకో !

ఎట్టకేలకు తన గత సినిమా `రాక్ష‌సుడు`తో హిట్ అందుకున్న యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా పెట్టి.. కందిరీగ‌, ర‌భ‌స, హైప‌ర్‌ ఫేమ్ సినిమాల డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం అక్టోబర్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ చేయటానికి ఈ చిత్రానికి సంబంధించిన సెట్ వర్క్ జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమా టీం గురించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ తెలిసింది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌, ఈ సినిమా కెమెరామెన్ విషయంలో […]

Written By:
  • admin
  • , Updated On : August 13, 2020 / 06:38 PM IST
    Follow us on


    ఎట్టకేలకు తన గత సినిమా `రాక్ష‌సుడు`తో హిట్ అందుకున్న యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా పెట్టి.. కందిరీగ‌, ర‌భ‌స, హైప‌ర్‌ ఫేమ్ సినిమాల డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం అక్టోబర్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ చేయటానికి ఈ చిత్రానికి సంబంధించిన సెట్ వర్క్ జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమా టీం గురించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ తెలిసింది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌, ఈ సినిమా కెమెరామెన్ విషయంలో మొదటి నుండి అసంతృప్తిగా ఉన్నాడట. మెయిన్ గా సంతోష్ వర్కింగ్ స్టైల్ కు, ఈ చిత్రానికి కెమెరామెన్ గా పనిచేస్తోన్న డూడ్లీ వర్కింగ్ స్టైల్ కి అసలు సింక్ అవ్వట్లేదట. కరోనాకి ముందు చేసిన షెడ్యూల్ లోనే కొన్ని షాట్స్ మేకింగ్ లో ఇద్దరి మధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయని.. ప్రస్తుతం అప్పుడు తీసిన షాట్స్ కి సంబంధించిన డిఐ జరుగుతున్న క్రమంలో కూడా ఇద్దరి మధ్య తేడా వచ్చిందని తెలుస్తోంది.

    Also Read: పాపం కాజల్.. కరోనా హీరోతో కిస్ !

    ఆ కారణంగానే కెమెరామెన్ డూడ్లీ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడట. నిజానికీ డూడ్లీ మంచి కెమెరామెనే. డూడ్లీ బాలీవుడ్‌లో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌, సింగం’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫ‌ర్‌ గా ప‌నిచేసిన చరిత్ర ఉంది ఆయనకు. మరి అలాంటి కెమెరామెన్ తో సంతోష్ శ్రీనివాస్ లాంటి డైరెక్టర్ గొడవ పడటం ఏమిటో.. అయినా సక్సెస్ ట్రాక్ లో లేని డైరెక్టర్ కు ఇగోలు ఉండకూడదు. అసలుకే చాలా గ్యాప్ తరువాత సంతోష్ శ్రీనివాస్ కి సినిమా ఛాన్స్ వచ్చింది. ఇలాంటి టైంలో కూడా అనవసరంగా గొడవలు పడి ఉన్న విలువను కూడా ఎందుకు పోగొట్టుకోవడం.

    Also Read: పెళ్లి మూడ్ నుండి బిజినెస్ మూడ్ లోకి !

    ఇక సంతోష్ శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ కోసం కామెడీగా సాగే పక్కా యాక్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడట. బెల్లంకొండ మీద యాక్షన్ వర్కౌట్ కాదని ఇప్పటికే లెక్కకు మించి ప్రూవ్ అయిపోయింది. అలాంటప్పుడు, మనోడు ఇక ఎంత యాక్షన్ చేస్తే ఏం లాభం… ఏంటో ఈ బెల్లంకొండకు యాక్షన్ సెట్ అవ్వదని ఇక ఎప్పుడు అర్ధం చేసుకుంటాడో. అన్నట్టు సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై జి.సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ సినిమాని భారీగా నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆయన ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.