ఇదంతా పక్కన పెడితే మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో పాన్ ఇండియన్ సినిమాల కంటే తక్కువ రేట్స్ తో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం, అత్యధిక రేట్లతో విడుదలైన ‘దేవర’ కంటే ఎక్కువగా నేషనల్ మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఉదాహరణకు కొన్ని సిటీస్ లో ఈ చిత్రం ఏ రేంజ్ ర్యాంపేజ్ వేసిందో చూద్దాం. హైదరాబాద్ సిటీ లో ‘దేవర’ చిత్రానికి 16 కోట్ల 42 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మొదటి వారంలో వస్తే, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి 10 రోజులకు గాను 17 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా వైజాగ్ ప్రాంతం లో ‘దేవర’ చిత్రానికి నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ గ్రాస్ వసూళ్లు 2 కోట్ల 60 లక్షల రూపాయిలు క్లోజింగ్ లో వస్తే, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి కేవలం 10 రోజుల్లో 2 కోట్ల 63 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా విజయవాడ లో దేవర చిత్రానికి క్లోజింగ్ లో 3 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నేషనల్ మల్టీప్లెక్స్ షోస్ నుండి వస్తే, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి కేవలం 10 రోజుల్లో 2 కోట్ల 45 లక్షల రూపాయిలు వచ్చాయి. నేటి తో ‘దేవర’ క్లోజింగ్ కలెక్షన్స్ ని కూడా దాటేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, కర్ణాటక లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఫుల్ రన్ లో ఈ చిత్రం కేవలం కర్ణాటక రాష్ట్రం నుండి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఇప్పటి వరకు వచ్చాయి. ఫుల్ రన్ లో ఇంకో రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతీ సెంటర్ లో ఈ సినిమా పెడుతున్న వసూళ్ల టార్గెట్ స్టార్ హీరోలకు కూడా పెద్ద సవాల్ గా మారిపోయింది.