https://oktelugu.com/

Sankranthiki Vastunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది..ఆడియన్స్ కి పండగే..ఎందులో చూడాలంటే!

విక్టరీ వెంకటేష్ కుంభస్థలం బద్దలు కొడితే ఎలా ఉంటుందో, ఈ సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు చూపించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ది బెస్ట్ కం బ్యాక్ ఇచ్చిన హీరోలలో వెంకటేష్ కూడా ఒకరిగా చేరిపోయాడు.

Written By:
  • Vicky
  • , Updated On : February 7, 2025 / 04:05 PM IST
    Follow us on

    Sankranthiki Vastunnam: విక్టరీ వెంకటేష్ కుంభస్థలం బద్దలు కొడితే ఎలా ఉంటుందో, ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు చూపించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ది బెస్ట్ కం బ్యాక్ ఇచ్చిన హీరోలలో వెంకటేష్ కూడా ఒకరిగా చేరిపోయాడు. గత 20 ఏళ్ళ నుండి వెంకటేష్ కి మల్టీ స్టార్రర్ చిత్రాల ద్వారా సూపర్ హిట్స్ వచ్చాయి కానీ, సోలో హీరోగా మాత్రం సూపర్ హిట్స్ రాలేదు. మధ్యలో దృశ్యం, గురు, బాబు బంగారం లాంటి సినిమాలు వచ్చాయి కానీ, అవి వెంకటేష్ రేంజ్ లో సూపర్ హిట్స్ కాలేకపోయాయి. ఇక గత సంక్రాంతికి ఆయన హీరోగా నటించిన ‘సైంధవ్’ చిత్రం కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఫుల్ రన్ లో కనీసం 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.

    అలాంటి స్థితి నుండి నేడు ప్రాంతీయ బాషా చిత్రంతో 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టడం అనేది చిన్న విషయం కాదు. వెంకటేష్ తప్ప ఇప్పటి వరకు ఒక్క హీరో కూడా ప్రాంతీయ బాషా చిత్రాలతో 300 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టినట్టు చరిత్ర లేదు. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్ లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఈ వీకెండ్ లో కూడా ఈ చిత్రానికి మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ‘పుష్ప 2 ‘ చిత్రాన్ని జనాలు ఆ రేంజ్ లో చూసిన తర్వాత వెంటనే విడుదలైన మరో సినిమాకి అంతకు మించి చూస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఇంతటి బ్లాక్ బస్టర్ రన్ తో దూసుకుపోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొడుతోంది.

    ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నిర్మాత దిల్ రాజు జీ5 సంస్థ కి భారీ రేట్ కి అమ్మేశాడు. నాలుగు వారాల తర్వాత ఎప్పుడైనా ఈ చిత్రాన్ని ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసుకునేటట్టు ఒప్పందం కుదిరించుకున్నాడు. కానీ థియేట్రికల్ రన్ అద్భుతంగా ఉండడంతో కొన్ని రోజులు వాయిదా వేయించాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 27 వ తారీఖున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఓటీటీ విడుదల తేదికి సంబంధించిన ప్రకటన అధికారికంగా రానుంది. థియేటర్స్ లో ఇంతటి అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో లేదో చూడాలి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక యూజర్లు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా మీడియా కి ఉన్నారు. జీ5 ని ఉపయోగించే వాళ్ళు తక్కువే, మరి మిగిలిన సినిమాలకు ఉన్నంత రీచ్ ఈ చిత్రానికి ఉంటుందో లేదో చూడాలి.