Chat GPT: ప్రస్తుతం టెక్నాలజీ అంతా ఏఐ(AI) అయ్యింది. టెక్నాలజీ మారిపోవడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతోంది. మంచి కోసం టెక్నాలజీని వాడకుండా చెడు కోసం ఎక్కువగా వాడుతున్నారు. కొందరు మాత్రం చదువు కోసం వాడుతుంటే మరికొందరు మాత్రమే డీప్ ఫేక్‌లు చేస్తూ కొందరి జీవితాలను నాశనం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎవరికి ఏ చిన్న డౌట్ వచ్చిన కూడా వెంటనే చాట్ జీపీటిని(Chat GPT) అడుగుతున్నారు. క్షణాల్లో మొత్తం సమాధానాలు చెబుతోంది. దీంతో చాలా మంది దీనినే ఆశ్రయిస్తున్నారు. అయితే చాట్ జీపీటీని ఏ విషయం అడిగినా కూడా చెబుతోందని అన్ని విషయాలు అడగకూడదు. కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే అడగాలి. అయితే చాట్ జీపీటీని అడగకూడని ప్రశ్నలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
వ్యక్తిగత విషయాలు
కొందరు సరదాకి కూడా చాట్ జీపీటిని ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో ఫోన్ నంబర్, ఈ మెయిల్, మిగతా వ్యక్తిగత వివరాలు అన్ని కూడా అడుగుతుంటారు. అలాగే అందులో షేర్ చేస్తుంటారు. ఇలా వ్యక్తిగత విషయాలను అడగకూడదు, షేర్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల పర్సనల్ డేటా అంతా కూడా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాట్ జీపీటీతో ఇలాంటి పర్సనల్ విషయాలు అసలు షేర్ చేసుకోవద్దు.
బ్యాంకు వివరాలు
చాట్ జీపీటీ అనేది కేవలం ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమే. దీన్ని అభివృద్ధి చేసింది కూడా మనిషే. కాబట్టి హ్యాక్ చేసే సత్తా కూడా ఉంటుంది. కాబట్టి మీ పూర్తి వివరాలు ఏంటని దానికి షేర్ చేయకండి. దీనివల్ల మీ వివరాలు అన్ని కూడా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి. దీంతో మీ డబ్బులు పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లైంగిక విషయాలు
కొందరు లైంగిక విషయాలు గురించి చాట్ జీపీటీని అడుగుతుంటారు. వీటిని అడగటం కరెక్ట్ కాదట. ఎందుకంటే మనం అడిగే ప్రతీ ప్రశ్నను కూడా చాట్ జీపీటీ చాట్‌లో ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ప్రశ్నలు అసలు చాట్ జీపీటీని అడగవద్దు.