Sankranthiki Vasthunam : విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కామెడీ తో పాటు సెంటిమెంట్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా పండడంతో ఈ సినిమాకి ఆడియన్స్ నుండి ఈ స్థాయి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలకు థియేటర్స్ లో ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే యూట్యూబ్ లో ‘గోదారి గట్టుమీద’ పాటకు 94 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఆడియో పరంగా ఈ పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉంది. వెంకటేష్ కి సరైన కాంబినేషన్ పడితే ఎలాంటి వసూళ్లు వస్తాయో ఈ సినిమా ఒక ఉదాహరణగా నిల్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం హైదరాబాద్ సిటీ నుండి ఈ సినిమాకి 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. వెంకటేష్ నటించిన గత చిత్రానికి కనీసం 15 కోట్ల రూపాయిల గ్రాస్ కూడా ఫుల్ రన్ లో రాలేదు. అలాంటిది ఈ చిత్రానికి కేవలం బుకింగ్స్ ద్వారా ఇంత వసూళ్లు రావడం ఇండస్ట్రీ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా పక్కన పెడితే ఓవర్సీస్ లో ప్రతీ సినిమాకి శుక్రవారం, లేదా శనివారం ప్రీమియర్ షోస్ పడుతూ ఉంటాయి. కేవలం ఆ వీకెండ్ లో మాత్రమే భారీ వసూళ్లు వస్తుంటాయి. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి ప్రీమియర్ షోస్ అక్కడ సోమవారం రోజు పడనున్నాయి. సోమవారం హాలీవుడ్ చిత్రాలకు కూడా కనీసం స్థాయి ఆక్యుపెన్సీ దక్కదు. అలాంటిది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రెండు లక్షల గ్రాస్ ని అందుకుంది.
ప్రీమియర్ షోస్ ముగిసే సమయానికి కచ్చితంగా హాఫ్ మిలియన్ డాలర్ మార్కుని అందుకుంటుందని మేకర్స్ బలమైన నమ్మకం తో ఉన్నారు. ఇప్పటి వరకు సోమవారం విడుదలైన సినిమాలు ఒక్క దానికి కూడా ఈ స్థాయి గ్రాస్ వసూళ్లు రావడం జరగలేదు. మొట్టమొదటిసారి సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికే జరిగింది. ఆ విధంగా విక్టరీ వెంకటేష్ ఈ వయస్సులో లో కూడా ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్స్ కి కూడా సాధ్యం కానటువంటి రికార్డు ని నెలకొల్పి సంచలనం సృష్టించాడు. ఓవరాల్ గా మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు దక్కే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 36 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది. రేపటితో బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది.