https://oktelugu.com/

Ram Gopal Varma: ‘గేమ్ చేంజర్’ వసూళ్లపై రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్షియల్ కామెంట్స్..టాలీవుడ్ పరువు తీస్తున్నారంటూ ఆందోళన!

రామ్ చరణ్ కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ని దెబ్బతీసే విధంగా నిర్మాతలు ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ ని వేస్తున్నారని, మన టాలీవుడ్ పరువుని కూడా తీస్తున్నారంటూ సోషల్ మీడియా లో ఇతర హీరోల అభిమానులు ఆరోపిస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : January 14, 2025 / 03:00 PM IST

    Ram Gopal Varma(1)

    Follow us on

    Ram Gopal Varma: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోగా, ఓపెనింగ్ వీకెండ్ లో మాత్రం రామ్ చరణ్ స్టార్ స్టేటస్ కారణంగా డీసెంట్ స్థాయి వసూళ్లను సొంతం చేసుకొని పర్వాలేదు అనిపించుకుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడు రోజుల్లో 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది చెప్తున్నారు . కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమాకి మొదటి రోజు ఏకంగా 186 కోట్ల రూపాయిలు వచ్చాయని ఒక పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేసారు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రామ్ చరణ్ కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ని దెబ్బతీసే విధంగా నిర్మాతలు ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ ని వేస్తున్నారని, మన టాలీవుడ్ పరువుని కూడా తీస్తున్నారంటూ సోషల్ మీడియా లో ఇతర హీరోల అభిమానులు ఆరోపిస్తున్నారు.

    అయితే వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కాంట్రోవర్సిల్లో చిక్కుకునే రామ్ గోపాల్ వర్మ, గేమ్ చేంజర్ వసూళ్లపై కూడా ఇలాంటి కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు తమ సినిమాలతో కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టి మన టాలీవుడ్ ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకి తీసుకెళ్తే, ‘గేమ్స్ చేంజర్’ చిత్రం టీం మాత్రం మన సౌత్ ఇండియా ఫేక్ కలెక్షన్స్ వేయడంలో కూడా ఆకాశమంత ఎత్తుకి ఎదిగిందని నిరూపించి మన సౌత్ ఇండియన్ సినిమా పరువు తీశారు. ఈ ఫేక్ కలెక్షన్స్ వేయడం వెనుక దిల్ రాజు హస్తం ఉండి ఉండకపోవచ్చు. ఇంతకు ముందు ఎప్పుడూ ఆయన ఇలా చేయలేదు. అతను కాకుండా ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యులు ఇలా చేసి ఉంటారని అనుకుంటున్నాను’ అంటూ ఆయన చిరంజీవి, రామ్ చరణ్ పై పరోక్షంగా కామెంట్స్ వేశాడు.

    రామ్ గోపాల్ వర్మ మొదటి నుండి మెగా ఫ్యామిలీ కి సంబంధించి ఇలాంటి కామెంట్స్ చేస్తూనే ఉండడం అలవాటు గా మారిపోయింది. ఫేక్ కలెక్షన్స్, ఫేక్ పోస్టర్స్ వంటివి ప్రతీ స్టార్ హీరో సినిమాకి వేస్తూనే ఉంటారు. అప్పుడు లేవని రామ్ గోపాల్ వర్మ నోరు, ఇప్పుడు లేస్తుందంటే అది మెగా హీరో సినిమా అవ్వడం వల్లే. మెగా ఫ్యామిలీ ఆయనకీ ఏ అన్యాయం చేయలేదు. రామ్ గోపాల్ వర్మనే చిరంజీవి తో సినిమా ప్రారంభించి మధ్యలోనే వదిలేసి బాలీవుడ్ కి పారిపోయాడు. ఉంటే చిరంజీవి కి కోపం ఉండాలి కానీ, రామ్ గోపాల్ వర్మ కి కోపం ఉండడం ఏమిటో. కేవలం రామ్ గోపాల్ వర్మ మాత్రమే కాదు, మెగా ఫ్యామిలీ ని ఇష్టపడని ప్రతీ ఒక్కరూ ‘గేమ్ చేంజర్’ కి ఫ్లాప్ టాక్ రావడాన్ని సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ పొలిటికల్ గా సంచలనం సృష్టించడం, దానిని వాళ్ళు జీర్ణించుకోలేకపోవడమే అందుకు కారణమని అంటున్నారు విశ్లేషకులు.