Bangarraju: సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ‘బంగార్రాజు’.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

Bangarraju: తండ్రీ తనయుడు నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం ‘బంగార్రాజు’.. సంక్రాంతి కానుకగా విడుదలైంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫిల్మ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల విడుదల అవుతాయని అందరూ అనుకున్నారు. కానీ, కొవిడ్ పరిస్థితుల వలన వాయిదా పడ్డాయి. కాగా, ‘బంగార్రాజు’ చిత్రానికి అలా కొంత మేరకు అడ్వాంటేజ్ కూడా అయిందని చెప్పొచ్చు. ఇకపోతే ఈ చిత్రానికి ఫస్ట్ డేనే బంపర్ కలెక్షన్స్ వచ్చాయి. తొలి […]

Written By: Mallesh, Updated On : January 15, 2022 3:31 pm
Follow us on

Bangarraju: తండ్రీ తనయుడు నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం ‘బంగార్రాజు’.. సంక్రాంతి కానుకగా విడుదలైంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫిల్మ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల విడుదల అవుతాయని అందరూ అనుకున్నారు. కానీ, కొవిడ్ పరిస్థితుల వలన వాయిదా పడ్డాయి. కాగా, ‘బంగార్రాజు’ చిత్రానికి అలా కొంత మేరకు అడ్వాంటేజ్ కూడా అయిందని చెప్పొచ్చు. ఇకపోతే ఈ చిత్రానికి ఫస్ట్ డేనే బంపర్ కలెక్షన్స్ వచ్చాయి. తొలి రోజున రూ.13.30 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Bangarraju:

కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇందులో నాగచైతన్య సరసన ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి నటించగా, నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించింది. ఈ సినిమాకు తొలి రోజు రూ.13.30 కోట్లు రాగా, ఇందులో ఇండియా నుంచి వచ్చిన వసూళ్లు రూ.12.40 కోట్లుగా ఉన్నాయి. ఓవర్ సీస్ రూ.90 లక్షలు ఉన్నాయి. నైజాంలో రూ. 2కోట్లు, సీడెడ్‌లో రూ.1.75 కోట్లు, గుంటూరులో రూ.89 ల‌క్ష‌లు, కృష్ణా రూ.45 ల‌క్ష‌లు, నెల్లూరు రూ.34 ల‌క్ష‌లు, వెస్ట్ రూ.65 ల‌క్ష‌లు, ఈస్ట్ రూ.75 లక్ష‌లు, ఉత్త‌రాంధ్ర రూ.1కోటి 25 ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌చ్చాయి.

Also Read:  ఇండియాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు.. ‘మేం ఛాంపియన్స్’ అంటూ కేటీఆర్ రిప్లై

ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. మొత్తంగా ఈ పిక్చర్‌కు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలుపుకున్నట్లయితే రూ.8.08 కోట్ల షేర్స్ వ‌సూలయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ షేడ్స్‌తో ఉన్న ఈ ‘బంగార్రాజు’ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ‘బంగార్రాజు’ చిత్రంలో నాగచైతన్య సరసన కృతిశెట్టి మెయిన్ హీరోయిన్ గా నటించింది. అయితే, ఇందులో ‘చిట్టి’ అలియాస్ ఫరియా అబ్దుల్లా స్పెషల్ సాంగ్ చేసింది. ఫరియాతో పాటు దక్ష నగార్కర్ కూడా కీ రోల్ ప్లే చేసింది. మొత్తంగా సంక్రాంతి బరిలో నిలిచిన ‘బంగార్రాజు’ విజేతగా నిలిచాడని సినీ పరిశీలకులు అంటున్నారు.

Also Read:  కరోనా కాటు.. మళ్లీ స్కూళ్లు బందేనా?

Tags