https://oktelugu.com/

Top Director: హీరోయిన్ కోసం రెండున్నర సంవత్సరాలు వెయిట్ చేసిన టాప్ డైరెక్టర్…అసలేం జరిగిందంటే..?

ఈయన ఎక్కువగా పిరియాడికల్ డ్రామా సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడంలో ఈయనను మించిన దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : April 29, 2024 / 10:51 AM IST

    Sanjay Leela Bhansali revealed he tried to cast Madhuri Dixit

    Follow us on

    Top Director: బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు మంచి సినిమాలను తీసి వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ముఖ్యంగా ‘సంజయ్ లీలా భన్సాలీ’ కూడా వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ సినిమాలు చేసి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నాడు.

    ఇక ఈయన ఎక్కువగా పిరియాడికల్ డ్రామా సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడంలో ఈయనను మించిన దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక రన్వీర్ సింగ్, దీపిక పదుకునే లను హీరో హీరోయిన్లు గా పెట్టి ఈయన తీసిన ‘రామ్ లీలా’ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు ఈయన మాధురి దీక్షిత్, షారుక్ ఖాన్ లని పెట్టి తీసిన దేవదాసు సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమాకి ముందే ఆయన చేసిన ఒక రెండు సినిమాల్లో మాధురి దీక్షిత్ ను హీరోయిన్ గా తీసుకోవాలని చాలా ప్రయత్నం చేసినప్పటికీ అది కుదరలేదట…

    ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న భన్సాలీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, ‘ఖామోషి’ అనే సినిమాలలో తనని తీసుకోవాలని చాలా వరకు ప్రయత్నం చేశారట. ఇక ఖామోషి సినిమా స్క్రిప్ట్ ను ఒకటికి రెండుసార్లు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఇక అందులో భాగంగానే ఆమె కోసం రెండున్నర సంవత్సరాల పాటు వెయిట్ చేశాడట. అయినా కూడా కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సినిమాను తను చేయలేకపోయిందట. దాంతో ఎలాగైనా సరే దేవదాసు సినిమాలో తనను ఒప్పించి ఆ సినిమా తనతోనే చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారట. అందుకే ముందు ఆమె డేట్స్ తీసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళ డేట్స్ తీసుకొని సినిమాని స్టార్ట్ చేసి ఫినిష్ చేసి రిలీజ్ చేశారట.

    ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా వీళ్ళందరికీ మంచి గుర్తింపు కూడా తీసుకొచ్చింది. అలా సంజయ్ లీలా బన్సాలి, మాధురి దీక్షిత్ తో సినిమా అయితే చేశారు. ప్రస్తుతం ఆయన ‘హిరమండి’ అనే ఒక వెబ్ సిరీస్ ని చేస్తున్నాడు. దీంతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు…