https://oktelugu.com/

Micro SUV EV: మారుతి నుంచి మైక్రో ఎస్ యూవీ ఈవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

మైక్రో ఎస్ యూవీ ఈవీ స్టైలీ బాక్సీ డిజైన్ ను కూడుకొని ఉంది. ఇందులో 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ తో పాట టర్బో ఇంజిన్ కూడా ఉండే అవకాశాలున్నాయి. సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : April 29, 2024 10:52 am
    Maruthi Suv Electric

    Maruthi Suv Electric

    Follow us on

    Micro SUV EV: దేశంలో కార్ల దిగ్గజం మారుతి సుజుకీ అనేక వేరియంట్లను తీసుకొచ్చి వినియోగదారుల మన్ననలను పొందింది. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎలక్ట్రిక్ కారు వరకు అన్ని రకాల కార్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే తాజాగా మైక్రో ఎస్ యూవీ ఎలక్ట్రిక్ కారును తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ తరహాలో టాటా పంచ్ ఈవీని వచ్చింది. కానీ ఇప్పుడు మారుతి సుజుకీ సైతం తన సత్తా నిరూపించుకునేందుకు మైక్రో ఎస్ యూవీని రెడీ చేస్తోంది. ఇది రిలీజ్ కావడానికి రెండు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. కానీ దీని గురించి వివరాలు అప్పుడే బయటకు వచ్చాయి. మారుతి మైక్రో ఎస్ యూవీ ఎలక్ట్రిక వివరాలు ఎలా ఉన్నాయంటే?

    పెట్రోల్, డీజిల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వైపు వినియోగదారుల మనసు మారుతోంది. దీంతో చాలా కంపెనీలు ఈవీ ఉత్పత్తుల విషయంలో కేర్ తీసుకుంటున్నారియ. కేంద్ర ప్రభుత్వం సైతం ఈవీల ఉత్పత్తులపై ట్యాక్స్ తక్కువగా విధించి ప్రోత్సహిస్తోంది. అయితే కొందరు ఎస్ యూవీ తో పాటు ఎలక్ట్రిక్ కార్లు కావాలనుకునే వారికి ఇప్పటికే టాటా పంచ్ ఈవీ అందుబాటులోకి వచ్చింది. దీని అమ్మకాలు ఎలా ఉన్నప్పటికీ మార్కెట్లో తమ వినియోగదారుల కోసం మారుతి సుజుకీ కొత్తగా మైక్రో ఎస్ యూవీ ఎలక్ట్రిక్ ను అందుబాటులోకి తీసుకురానుంది.

    మైక్రో ఎస్ యూవీ ఈవీ స్టైలీ బాక్సీ డిజైన్ ను కూడుకొని ఉంది. ఇందులో 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ తో పాట టర్బో ఇంజిన్ కూడా ఉండే అవకాశాలున్నాయి. సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉండనున్నాయి. దీనిని రూ.6 లక్షల ప్రారంభ ధరలతో విక్రయించే అవకాశాలు ఉన్నాయి. దీని డిజైన్ ఫోర్డ్ లేదా గ్రాండ్ విటారా మాదిరిగా ఉండే ఛాన్స్ ఉంది.

    ప్రస్తుతం మైక్రో ఎస్ యూవీ ఈవీ తయారవుతోంది. దీనిని 2026 సంవత్సరంలో మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కార్ల హవా రోజురోజుకు పెరుగుతుండడంతో మారుతి నుంచి మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం ఈ మోడల్ ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే హ్యాచ్ బ్యాక్ కార్లతో పాటు పలు ఎస్ యూవీలను అందుబాటులోకి తీసుకొచ్చిన మారుతి ఇప్పడు ఎలక్ట్రిక్ విభాగంలోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది.