Sandhya Theater Incident : పుష్ప 2 సక్సెస్ ని అల్లు అర్జున్ ఆస్వాదించలేకపోయాడు. ఓ ప్రమాదం ఆయన్ని విమర్శలపాలు చేసింది. అనూహ్యంగా ఒకరోజు రాత్రి అల్లు అర్జున్ జైలులో గడిపాడు. డిసెంబర్ 5న పుష్ప 2 వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఒక రోజు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ప్రదర్శన మొదలైంది. కాగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో డిసెంబర్ 4వ తేదీ రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో పడింది. ఈ షోకి హీరోయిన్ రష్మిక మందానతో పాటు అల్లు అర్జున్ హాజరయ్యాడు. భారీగా అభిమానులు చేరుకోవడం కారణంగా థియేటర్లో తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో ఒక వివాహిత కన్నుమూసింది. ఆమె 11 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ సైతం ప్రమాదానికి గురయ్యాడు. భర్త, కూతురు మాత్రం బయటపడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న శ్రీతేజ్ ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గత మూడు నెలలుగా శ్రీతేజ్ కి చికిత్స జరుగుతుంది. శ్రీతేజ్ పూర్తిగా కోలుకోలేదు. తాజా సమాచారం ప్రకారం శ్రీతేజ్ పూర్తిగా కోలుకోలేదు. అతడు మనుషులను గుర్తించడం లేదు. కళ్ళు మాత్రమే తెరుస్తున్నాడు. ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమీ ప్రాసెస్ ద్వారా ఆహారం అందిస్తున్నారు. చెప్పుకోదగ్గ పురోగతి కనిపించడం లేదని తెలుస్తుంది.
Also Read : సంధ్య థియేటర్ ఘటనలో తప్పెవరిది? తేల్చేసిన జనాలు! షాకింగ్ సర్వే
శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప నిర్మాతలు, అల్లు అర్జున్ కలిసి రూ. 2 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి సైతం ఆర్థిక సహాయం చేశారు. కాగా సంధ్య థియేటర్ ఘటన రాజకీయ దుమారం రేపింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పించారు. అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిల్ పై విడుదలయ్యాడు. అల్లు అర్జున్ ని పరామర్శించేందుకు ఇండస్ట్రీ పెద్దలు ఆయన ఇంటికి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ని ఎవరైనా పరామర్శించారా?, అల్లు అర్జున్ కి ఏమైందని ఆయన్ని పెద్దలు కలిసి సంఘీభావం తెలిపారంటూ ఫైర్ అయ్యారు.
నాకు ప్రమాదం గురించి తెలియదు. పరిస్థితి అదుపు తప్పేలా ఉందని తెలియగానే బయటకు వచ్చేశాను. ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న గౌరవం పోయేలా కొందరు మాట్లాడుతున్నారని అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశాడు. శ్రీతేజ్ ని కలవాలని అనుకున్నానని, ఆ సమయంలో కలవడం కరెక్ట్ కాదని తమ టీమ్ అపారని వివరణ ఇచ్చాడు.
Also Read : అల్లు అర్జున్ మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్..ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయి రేంజ్ అప్డేట్ రెడీ!