Spirit: స్పిరిట్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో చెప్పేసిన సందీప్ వంగ…

ప్రభాస్ సినిమా పైన ప్రేక్షకులందరూ భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే సందీప్ మేకింగ్ చాలా డిఫరెంట్ గా ఉండటమే కాకుండా ఒక హీరో ను పర్ఫెక్ట్ గా ఎలివెట్ చేస్తూ మంచి సక్సెస్ లను అందుకోవడంలో తను ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు.

Written By: Gopi, Updated On : January 9, 2024 10:09 am

Spirit

Follow us on

Spirit: ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో స్పిరిట్ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే ఆయన తీసిన మూడు సినిమాలతో సూపర్ డూపర్ హిట్ల ను అందుకున్నాడు.

దాంతో ప్రభాస్ సినిమా పైన ప్రేక్షకులందరూ భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే సందీప్ మేకింగ్ చాలా డిఫరెంట్ గా ఉండటమే కాకుండా ఒక హీరో ను పర్ఫెక్ట్ గా ఎలివెట్ చేస్తూ మంచి సక్సెస్ లను అందుకోవడంలో తను ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. కాబట్టి సందీప్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అంటే ఈ సినిమా మీద ఆటోమేటిక్ గా ప్రేక్షకుల్లో అయితే అంచనాలైతే పుష్కలంగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో సందీప్ వంగ ప్రభాస్ ని ఎలా చూపిస్తున్నాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే సందీప్ ఈ సినిమాలో ప్రభాస్ ని ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎలా అయితే ఉంటాడో అలా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించలేదు సాహో సినిమాలో పోలీస్ గా నటించినప్పటికీ అది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు. కాబట్టి ఇది కచ్చితంగా ప్రభాస్ కి చాలా కొత్తగా ఉంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇలాంటి సిచువేషన్ లో ప్రభాస్ కి సందీప్ ఎలాంటి సక్సెస్ ఇస్తాడు అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.

ఇక ఇప్పటికే అనిమల్ తో అటు సందీప్, సలార్ తో ఇటు ప్రభాస్ ఇద్దరూ కూడా భారీ సక్సెస్ లను అందుకొని ఉన్నారు కాబట్టి ఈ సక్సెస్ లను కంటిన్యూ చేస్తూ ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా విజయవంతం చేస్తారని అందరూ ఈ సినిమా మీద భారీ అంచనలైతే పెట్టుకున్నారు. ఇక ఇంతకు ముందు సలార్ సినిమాలో ప్రశాంత్ నీల్ ఏ విధంగా అయితే ప్రభాస్ ను ఫుల్ గా వాడుకొని ఒక భారీ హిట్టు తీశాడో, ఇక తనకేమాత్రం తగ్గకుండా సందీప్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఈ సమ్మర్ నుంచి గాని లేదంటే దసరా నుంచి గాని షూటింగ్ కి వెళ్లనున్నట్లు గా తెలుస్తుంది…