Sandeep Vanga and Prabhas : టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ఇండియన్ ఆడియన్స్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ప్రభాస్(Rebel Star Prabhas) ‘స్పిరిట్'(Spirit Movie). సందీప్ వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా కాబట్టి, ఈ చిత్రం పై ప్రభాస్ అభిమానులకంటే ఎక్కువగా మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందో కానీ, అప్పుడు బాక్స్ ఆఫీస్ విద్వంసం ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశమే లేదని, ప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్’, హను రాఘవపూడి సినిమాల షూటింగ్స్ తో బిజీ ఉన్నాడని, ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వడానికి చాలా సమయం పడుతుందని, ఈ రెండిటి తర్వాత ఆయన హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో ఒక సినిమా చేయబోతున్నాడని నిన్న సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది.
కనీసం ఈ మూడు సినిమాల తర్వాత అయినా స్పిరిట్ ని మొదలు పెడతాడేమో అని అభిమానులు అనుకుంటే, స్పిరిట్ కంటే ముందు ‘కల్కి 2’ చేస్తాడని సోషల్ మీడియా లో రూమర్స్ ప్రచారం అయ్యాయి. అయితే ప్రభాస్ బిజీ లైనప్ ని చూసి విసుగెత్తిపోయిన సందీప్ వంగ, ‘స్పిరిట్’ కంటే ముందు ‘యానిమల్ పార్క్’ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడని మరో రూమర్ కూడా ప్రచారమైంది. ఇవి సోషల్ మీడియా లో బాగా చర్చకు రావడంతో సందీప్ వంగ వరకు చేరింది. దీంతో వెంటనే ఆయన తన టీం తో క్లారిటీ ఇప్పించాడు. ప్రస్తుతం సందీప్ వంగ ఫోకస్ మొత్తం ‘స్పిరిట్’ మీద మాత్రమే ఉందని, ఈ చిత్రం పూర్తి అయిన తర్వాతనే ‘యానిమల్ పార్క్’ సినిమా చేస్తాడని చెప్పుకొచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వచ్చే మూడు నెలల్లోనే స్పిరిట్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది అట.
ప్రభాస్ ఒకే సారి రెండు మూడు సినిమాల షూటింగ్స్ చేస్తూ వచ్చే సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే సందీప్ వంగ మాత్రం నా సినిమా చేసేటప్పుడు, మరో సినిమా చెయ్యకూడదు, నాన్ స్టాప్ గా 60 రోజుల డేట్స్ కావాలని ఒక షరతు పెట్టాడట. ఈ కారణం చేతనే ప్రభాస్ స్పిరిట్ చిత్రాన్ని వెనక్కి నెడుతూ వస్తున్నాడని ఒక రూమర్ ఉంది. సందీప్ వంగ నిజంగా ప్రభాస్ కి ఆ కండీషన్ పెట్టాడో లేదో కూడా అధికారికంగా తెలియదు, కేవలం ఇవన్నీ రూమర్స్ మాత్రమే. నిర్మాత స్వయంగా మూడు నెలల్లో స్పిరిట్ షూటింగ్ మొదలు అవుతుంది అని చెప్పాడు కాబట్టి, కచ్చితంగా ప్రభాస్ ఎప్పటి లాగానే ఒకేసారి రెండు ఘాటింగ్స్ చేసే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి ఇంకా ఎన్ని వినాలి అనేది.
Also Read : సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కోసం ఇక ఎంతకాలం వెయిట్ చేయాలి…