Athadu : రీ రిలీజ్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించాలంటే సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) టీం తర్వాతే ఎవరైనా. ఈ రీ రిలీజ్ ట్రెండ్ ని గ్రాండ్ గా మొదలు పెట్టిందే మహేష్ బాబు టీం. ‘పోకిరి’ సినిమాతో మొదలైన ఈ ట్రెండ్, దేశమంతటా పాకింది. అప్పటి వరకు ఒక పాత సినిమాని , లేటెస్ట్ 4K టెక్నాలజీ కి మార్చి ఇంత గ్రాండ్ గా రిలీజ్ చేయొచ్చా అనే ఆలోచన ఎవరికీ ఉండేది కాదు. అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ మూవీ స్పెషల్ షోస్ ని కొన్ని సెలెక్టెడ్ స్క్రీన్స్ లో వేసి సెన్సేషన్ సృష్టించారు. దీనిని చూసి మహేష్ ఫ్యాన్స్ ‘దూకుడు’ చిత్రాన్ని అదే స్టైల్ లో విడుదల చేశారు. ఇక ఆ తర్వాత ఒక అడుగు ముందుకేసి పోకిరి సినిమాని రీ రిలీజ్ చేసారు.
Also Read : మహేష్ బాబు కోసం 4 కథలు రాసుకున్నప్పటికి ఒక్క సినిమా కూడా చేయలేకపోయిన స్టార్ డైరెక్టర్…
ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫ్యాన్స్ ‘జల్సా’ మూవీని రీ రిలీజ్ చేసారు. ఇది కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక ఆ తర్వాత వరుసగా అందరూ అదే ట్రెండ్ ని అనుసరిస్తూ వచ్చారు. కానీ రీ రిలీజ్ రికార్డ్స్ మాత్రం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయి. ప్రస్తుతం మొదటి రోజు రికార్డు ‘గబ్బర్ సింగ్’ ఖాతాలో, ఫుల్ రన్ రికార్డు ‘అతడు'(Athadu 4K) ఖాతాలో ఉన్నాయి. ఇకపోతే ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు కి ‘అతడు’ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ లో ఆల్ టైం క్లాసిక్ అని పిలవబడే ఈ చిత్రం టీవీ టెలికాస్ట్ లో ఒక సునామీ ని సృష్టించింది అనే చెప్పాలి.
ఈ చిత్రాన్ని ఇప్పుడు కొత్త సినిమా విడుదల తరహాలో దింపాలని మహేష్ బాబు టీం ప్లానింగ్ చేస్తుంది. ఇప్పటి వరకు రీ రిలీజ్ సినిమాలు కేవలం 4k కి మార్చి విడుదల చేయడం మాత్రమే మనం చూసాము. కానీ ఈ చిత్రాన్ని ఐమాక్స్ వెర్షన్ లో కూడా దింపబోతున్నారట. ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదని అంటున్నారు. ఐమాక్స్ వెర్షన్ అంటే ఓవర్సీస్ లో ఆడియన్స్ ఈ స్క్రీన్స్ కోసం ఎగబడతారు. కొత్త సినిమాలకు అత్యధిక గ్రాస్ వసూళ్లు ఈ స్క్రీన్స్ నుండే వస్తుంటాయి. ఇక అతడు విద్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ సినిమా విడుదల సమయంలో కొత్త సినిమాలేవీ అడ్డు లేకుంటే కచ్చితంగా మొదటి రోజు పది కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు.
Also Read : 1500 సార్లు టీవీలో టెలికాస్ట్..వరల్డ్ రికార్డు నెలకొల్పిన మహేష్ బాబు!