Prabhas And Sandeep Vanga: ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే అది బాలీవుడ్ సినిమా అని బాలీవుడ్ దిగ్గజ హీరోలందరూ అనుకునేవారు కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీని పక్కనపెట్టి పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఉన్న ఒక మాఫియా అక్కడున్న కొంత మంది హీరోలను గాని, డైరెక్టర్లను గాని ఎదగనివ్వకుండా చాలా సంవత్సరాల నుంచి వాళ్లకు సంబంధించిన హీరోలే ఇక్కడ ఎదగాలి, వల్ల వాళ్లే డైరెక్టర్లు గా ఇక్కడ సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఉండేవారు ఒకవేళ వాళ్లకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలో ఎదిగినా లేదా సక్సెస్ కొట్టినా కూడా అది పెద్ద సినిమా కాదు అంటూ దానిమీద ట్రోలర్స్ చేతగాని, విమర్శకుల చేతగాని విమర్శలు చేయిస్తూ ఉండేవారు. అందులో ముఖ్యంగా బడా హీరోలు అయిన ఖాన్ త్రయం హస్తం ఉండగా కరణ్ జోహార్ కూడా అందులో కీలకపాత్ర వహించేవాడు.
అందుకే బాలీవుడ్ లో వీళ్ళ మీద పలువురు తీవ్రమైన విమర్శలు చేశారు. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాంటి ఒక హీరో మరణించడం వెనుక కూడా వీళ్ళ మాఫియానే కారణం అంటూ చాలా వార్తలు కూడా వచ్చాయి. అలాగే కంగనా రనౌత్ కూడా తన ఆవేదనను చాలాసార్లు కన్నీళ్ళతో వ్యక్తం చేసింది. ప్రియాంక చోప్రా అయితే కొంతమంది బాలీవుడ్ హీరోలు, డైరక్టర్ల ఒత్తిడి వల్లనే నేను అమెరికాకి వచ్చి ఒక్
ఇక్కడ సెటిల్ అవుతున్నాను అంటూ తను ఓపెన్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఇలా ఆ మాఫియా చెప్పిన వాళ్ళే అక్కడ హీరోలుగా కొనసాగాలి. ఏఆర్ రెహమాన్ లాంటి ఆస్కార్ అవార్డు గెలిచిన మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా అక్కడ అవకాశాలు లేకుండా చేశారు. ఎందుకు అంటే వాళ్ళ అనుమతి లేకుండా తను ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు అనే ఒకే ఒక భావనతో తనని ఇండస్ట్రీ మొత్తం పక్కన పెట్టేలా అతనికి ఎవరు పెద్దగా అవకాశాలు ఇవ్వకుండా చేస్తూ వచ్చారు. కానీ ఈ మాఫియా కి ఇటు ప్రభాస్, అటు సందీప్ రెడ్డి వంగ ఇద్దరు కూడా గట్టి కౌంటర్ ఇస్తున్నారు.బాహుబలి సినిమాతో రాజమౌళి చేసిన మ్యాజిక్ ని ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమాతో మరోసారి రిపీట్ చేస్తున్నాడు.బాహుబలి వచ్చిన మొదట్లో కూడా ఆ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేశారు.
అయినప్పటికీ బాహుబలి సినిమా వాటన్నింటిని దాటుకొని బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్టు కొట్టింది. ఒక్క బాలీవుడ్ లోనే 100 కోట్లకు పైన వసూళ్లను సాధించిన తెలుగు సినిమాగా కూడా మంచి రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ మాఫియా నడ్డి విరగ గొట్టాడు. ఆయన కబీర్ సింగ్ అనే పేరుతో అర్జున్ రెడ్డి ని బాలీవుడ్ లో రీమేక్ చేసినప్పటికీ ఆ సినిమాకి బాలీవుడ్ క్రిటిక్స్ అందరూ వన్ రేటింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ఆ సినిమా రేటింగ్స్ తో పని లేకుండా విశేషమైన ప్రేక్షకాదరణని అందుకుంటూ బాక్సఫీస్ వద్ద 350 కోట్లకు పైన కలక్షన్లను రాబట్టింది. ఇక ఇప్పుడు అనిమల్ సినిమాకి కూడా వాళ్ళు అలానే చేసినప్పటికీ అనిమల్ సినిమా సూపర్ సక్సెస్ సాధించి ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఓపెన్ గా మాట్లాడితే కొంతమంది బాలీవుడ్ మాఫియా గాళ్లు చేయడం వల్లే సినిమాకి రేటింగ్ సరిగా ఇవ్వడం లేదు అంటూ ఇన్ డైరెక్టుగా వాళ్లకి గట్టి కౌంటర్లు ఇచ్చాడు.
ఇక ఇదంతా చూసిన బాలీవుడ్ ఇండస్ట్రీలో అణచివేతకు గురవుతున్న హీరోలందరూ బాలీవుడ్ ఇండస్ట్రీకి ముఖ్యంగా ఆ మాఫియా గ్యాంగ్ కి సందీప్ రెడ్డి రూపం లో సరైన మొగుడు దొరికాడు అంటూ వాళ్లకు వాళ్లు కామెంట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక సలార్, అనిమల్ దెబ్బకి బాలీవుడ్ మాఫియా తట్ట బుట్ట సర్దుకోవాల్సి వస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే షారుక్ ఖాన్ నటించిన డంకి సినిమా బకెట్ తన్నేయడంతో బాలీవుడ్ లో ఖాన్ త్రయానికి పొగరు కూడా ఇప్పుడిప్పుడే తగ్గుతూ వస్తుందని పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…