Dhootha: అక్కినేని హీరో నాగ చైతన్యకు 2023 మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కస్టడీ ప్లాప్ అయ్యింది. అయితే ఓటీటీలో భారీ విజయం సాధించారు. ఫస్ట్ టైం నాగ చైతన్య డిజిటల్ సిరీస్ చేశాడు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ దూత టైటిల్ తో తెరకెక్కిన సస్పెన్సు థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కాగా దూత సిరీస్ కి విపరీతమైన రెస్పాన్స్ దక్కుతుంది. రిలీజ్ నాటి నుండే దూత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
దూత సిరీస్లో నాగ చైతన్య జర్నలిస్ట్ రోల్ చేశారు. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందుగానే పేపర్ కటింగ్స్ గా కనిపిస్తూ ఉంటాయి. దీని వెనకున్న మర్మం ఏమిటో అర్థం కాక నాగ చైతన్య ఘర్షణకు లోనవుతాడు. చివరి ఎపిసోడ్ వరకూ సస్పెన్సు కొనసాగుతుంది. డెబ్యూ సిరీస్ తో నాగ చైతన్య సక్సెస్ కొట్టాడు.
కాగా దూత ఇండియా వైడ్ నెంబర్ వన్ పొజిషన్ లో స్ట్రీమ్ అవుతుంది. దీనిపై నాగ చైతన్య హర్షం వ్యక్తం చేశాడు. సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. దూత అనంతరం ది ఫ్రీనలాన్సర్, ది రైల్వే మాన్, ది ఆర్చీస్, ది విలేజ్, బెర్లిన్ వంటి సిరీస్లు స్ట్రీమ్ అవుతున్నాయి. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో నాగ చైతన్య ఆరంభం అదిరింది.
ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీ చేస్తున్నారు. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతుంది. నాగ చైతన్యకు జంటగా సాయి పల్లవి నటిస్తుంది. వీరి కాంబోలో రెండో చిత్రం ఇది. గతంలో లవ్ స్టోరీ చిత్రం చేశారు. ఇది సూపర్ హిట్ కొట్టింది. తండేల్ మూవీలో నాగ చైతన్య నావికుడు పాత్ర చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది.