Sandeep Reddy Vanga Vs Srikanth Odela: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో సినిమా తీసే విధానాన్ని మార్చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ఈ మూవీ అతన్ని టాప్ రేంజ్ లోకి తీసుకెళ్లింది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లలో తను కూడా ఒకడిగా వెలుగుతూ ఉండటం విశేషం…ఇప్పుడు ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇంతకుముందు రన్బీర్ కపూర్ తో చేసిన అనిమల్ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది… ఈ సినిమా 900 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది. సందీప్ రెడ్డివంగా మేకింగ్ లో చాలా వైవిధ్యం ఉంటుందని ఇప్పటివరకు ఏ దర్శకుడు సైతం అలాంటి ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేయలేకపోయాడని అది ఒక సందీప్ కి మాత్రమే సాధ్యం అంటూ చాలామంది సినిమా విమర్శకులు సైతం సందీప్ రెడ్డివంగ ను పొగుడుతున్నారు…
‘దసర’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సైతం మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అప్పటివరకు సాఫ్ట్ సినిమాలను చేస్తున్న నానికి మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాడు. ఇప్పుడు ప్యారడైజ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ఈ సినిమాతో నాని టాప్ హీరో గా మారడం విశేషం…ఇందులో నాని డిఫరెంట్ గా జడల్ అనే ఒక క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు. ఈ సినిమా ఫుల్ లెంత్ మాస్ మూవీ గా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీ ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…
సందీప్ రెడ్డి వంగ వర్సెస్ శ్రీకాంత్ ఓదెల మధ్య ఒక భారీ కాంపిటీషన్ నడుస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ రేంజ్ కి వెళ్తారు ఎవరు తమ కెరియర్ ను కోల్పోతారు అనే విషయం మీదనే ప్రతి ఒక్కరి చర్చలైతే నడుస్తున్నాయి. సందీప్ ఇప్పటివరకు శ్రీకాంత్ ఓదెలకంటే ఒక అడుగు ముందు వరుసలో ఉన్నాడు.
ఆయన చేసిన రెండు సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. శ్రీకాంత్ ఓదెల చేసిన సినిమా సూపర్ సక్సెస్ అయింది. తన రెండో సినిమాగా చేస్తున్న ప్యారడైజ్ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఈ ఒక్క సక్సెస్ తనని టాప్ లెవెల్ కి తీసుకెళ్తుందా? లేదంటే పాతాళానికి పడగొడుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక శ్రీకాంత్ మేకింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మాస్ లో ఒక కొత్తదానాన్ని చూపిస్తూ ఆయా హీరోలకు ఇమేజ్ ను కట్టబెట్టడంలో అతను సిద్ధహస్తుడనే చెప్పాలి…సందీప్ రెడ్డి వంగ శ్రీకాంత్ ఓదెల ఇద్దరు టాప్ డైరెక్టర్స్ ఇక రాబోయే సినిమాతో ఎవరు ఇండస్ట్రీ హిట్ కొడితే వాళ్ళు టాప్ లోకి వెళ్ళిపోతారు…