Sandeep Reddy Vanga : అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ తీసింది మూడే సినిమాలు అయినా ఏడేళ్లలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు సందీప్ రెడ్డి వంగా. తను సినిమా చేస్తున్నాడంటే ఏదో ఒక డిఫరెంట్ కథ ఉండే ఉంటుందన్న క్యూరియాసిటీ నెలకొల్పారు. ఇందులో ‘యానిమల్’ మూవీ అతని కెరీర్ ని ఓ మలుపు తిప్పిందనే చెప్పొచ్చు. ఎంతో మంది డైరెక్టర్లు వారి రోల్ మోడల్ అని చెప్పుకునే ఆర్జీవీ కూడా.. నా కంటే గొప్పవాడు సందీప్ రెడ్డి అంటూ మెచ్చుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లలో మెమోరబుల్ విక్టరీని సాధించింది. అయితే ఈ సినిమాపై కొందరు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై సందీప్ రెడ్డి వంగ చాలా సార్లు స్పందించారు.
Also Read : సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీలో విలన్ గా చేయనున్న ఇద్దరు స్టార్ హీరోలు…
యానిమల్ సినిమా గురించి సందీప్ రెడ్డి వంగా చెబుతున్న డీటైలింగ్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా ఇస్తున్న వివరణలు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు . ఇలా దీనిపై ఓ బుక్ రాయొచ్చు అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగా, రణ్ బీర్ కపూర్‌ల మధ్య జరిగిన ఓ ఘటన గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. యానిమల్ మూవీలో రణ్ బీర్ బట్టల్లేకుండా నటించిన సంగతి తెలిసిందే. ఆ సీన్ గురించి సందీప్ రెడ్డి వంగా వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ సీన్ ను ముందుగా ప్రోస్థటిక్ మేకప్‌తోనే చేయాలని భావించారట. అప్పర్ బాడీ అలానే పెట్టి.. లోబర్ బాడీకి మాత్రం ప్రోస్థటిక్ మేకప్‌తో మేనేజ్ చేయాలని అనుకున్నారట. టెస్ట్ షూట్ చేసినప్పుడు చాలా బాగా వచ్చిందట. కానీ సెట్స్ మీదకు వెళ్లే సరికి మాత్రం ఏదో తేడా కొట్టినట్లు అనిపించిందట. సీన్ సరిగ్గా రావడం లేదని.. ఆ ఫీల్ రావడం లేదని సందీప్ రెడ్డి హీరోతో అన్నాడట. ఇక ఈ ఇద్దరూ పది నిమిషాలు చర్చించుకుని.. అసలు ఈ ప్రోస్థటిక్ మేకప్ లేకుండా చేస్తానని రణ్ బీర్ అన్నాడట.
ఆ నిర్ణయంతో సెట్లో ఉన్న వాళ్లంతా షాక్ అయ్యినట్లు సందీప్ రెడ్డి చెప్పుకొచ్చారు. రణ్ బీర్ స్టార్ హీరో.. అలా వెంటనే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే నెక్ట్స్ డే షూటింగ్ పెట్టుకోండి.. మళ్లీ మేకప్ సెట్ చేసుకోండి అని చెప్పొచ్చని.. కానీ రణ్ బీర్ మాత్రం సీన్ పర్ఫెక్షన్ కోసం వెంటనే ఒప్పుకున్నాడని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు. ఇలా ఓ డైరెక్టర్, హీరో మధ్య సింక్ కుదిరితే సినిమా అద్భుతంగా వస్తుందని అంటున్నారు.
ఇది ఇలా ఉంటే ప్రభాస్ స్పిరిట్ గురించి మాట్లాడుతూ.. నేను ఇప్పుడు కచ్చితంగా రెండు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.. కలెక్షన్ల గురించి చెప్పలేను కానీ.. సినిమా మాత్రం అద్భుతంగా చాలా బాగుండేలా మాత్రం చేయగలనని అన్నారు.
Also Read : అర్జున్ రెడ్డి సినిమాలో సందీరెడ్డి వంగ కనిపించే ఒకే ఒక్క సీన్ ఏంటో తెలుసా?