Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ఆయన రన్బీర్ కపూర్ తో చేసిన అనిమల్ (Animal) సినిమాతో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కాయి. అయితే ఈ రెండు సినిమాల్లో కూడా ఇన్నర్ గా ఒక బేసిక్ లవ్ స్టోరీ అయితే ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. మరి అలాంటి ఒక మంచి మేకర్ ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలపాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఇందులో ప్రభాస్ ని ఒక డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటింపజేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ పూర్తయిన ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదికి తీసుకెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ని సందీప్ రెడ్డివంగా ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు.
Also Read : సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబు కాంబోలో సినీమా వచ్చే అవకాశాలు ఉన్నాయా..?
మరి ఈ సినిమా కనక సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తే సందీప్ ఓవర్ నైట్ లో పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు. ఇక స్పిరిట్ (Spitit) సినిమా దాదాపు 900 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా పాన్ వరల్డ్ లో సైతం ఈ సినిమాతో ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఇప్పటివరకు ఆయన చేసిన బాహుబలి, సలార్, కల్కి లాంటి సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ లను అందుకోనప్పటికీ ఇతర దేశాల్లో రిలీజ్ చేసిన ఈ సినిమాలు మంచి వసూళ్లను సాధించాయి. కానీ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న సినిమా మాత్రం పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది.
ఇక ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాతో కనక బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొడితే డైరెక్ట్ గా పాన్ వరల్డ్ లో ఉన్న హీరోని సైతం డైరెక్ట్ చేసే అవకాశం అందుకోవచ్చు.
Also Read : స్పిరిట్ సినిమాలో కొత్త ప్రభాస్ ను చూడబోతున్నారు : సందీప్ వంగ…