Sandeep Reddy Vanga: ఒకప్పుడు సినిమా అంటే అందులో కథ బాగుంటే చాలు సినిమాని ఎలా తెరకెక్కించినా ప్రేక్షకులు చూసి ఆదరించేవారు. కానీ ఇప్పుడు మేకింగ్ స్టాండర్డ్స్ మొత్తం మారిపోయాయి… విజువల్స్ చాలా రిచ్ గా ఉండి మేకింగ్ లో సత్తా చాకునే విధంగా ఉంటేనే ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరిస్తున్నారు. ఏమాత్రం తేడా కొట్టిన కూడా సగటు ప్రేక్షకులు ఆ సినిమాను రిజెక్ట్ చేస్తున్నారు. ఇక దర్శకులతో పాటు ప్రేక్షకులు చాలా వరకు అప్డేట్ అయ్యారు. ఏ సినిమాకి ఎంత టెక్నికల్ వాల్యూస్ ఉండాలి అనేది కూడా ప్రేక్షకుల నిర్ణయించే స్థాయికి ఎదిగారు అంటే వాళ్ళకి సినిమా నాలెడ్జి ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు కథ తో పాటు అతని మేకింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కాబట్టే తనకు సినిమాల మీద మంచి అవగాహన ఉందని పలువురు సినిమా మేధావులు సైతం చెబుతున్నారు. నిజానికి ఒక ప్రేక్షకుడిని రంజింప చేయడంలో ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంది. కానీ సందీప్ మాత్రం డిఫరెంట్ గా తన సినిమాను చేస్తుంటాడు. ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమా కోసం మొదటిసారి ప్రభాస్ తో పోలీస్ డ్రెస్ వేయిస్తున్నాడు…
తను అనుకున్నట్టుగానే ఈ డ్రెస్ లో సందీప్ ఎలాంటి సత్తా చాటుతాడు. తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అయిన రన్బీర్ కపూర్ కూడా నటిస్తున్నాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది…
నిజానికి రన్బీర్ కపూర్ తో సందీప్ ఇంతకు ముందు అనిమల్ మూవీ చేశాడు. కాబట్టి సందీప్ మీద రన్బీర్ కి చాలా మంచి నమ్మకమైతే ఉంది. అందుకే స్పిరిట్ సినిమాలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రన్బీర్ సైతం నటిస్తే ఈ మూవీ కి కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. నిజానికి రన్బీర్ తో పాటు ప్రభాస్ కి కూడా బాలీవుడ్ లో చాలా మంచి క్రేజ్ ఉంది.
కానీ ఇద్దరూ ఉంటే సినిమా కలెక్షన్స్ కొల్లగొట్టడం ఈజీ అవుతుందనే ఉద్దేశ్యంతోనే సందీప్ రణ్బీర్ కపూర్ ని ఈ సినిమా కోసం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి తన క్యారెక్టర్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే అతను ఈ సినిమాలో నటిస్తున్నాడు అనే దానిమీద తొందర్లోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది…