Pawan Kalyan Sandeep Reddy Vanga : మన టాలీవుడ్ డైరెక్టర్స్ లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) వీరాభిమానుల లిస్ట్ తీస్తే అందులో సందీప్ వంగా(Sandeep Reddy Vanga) కచ్చితంగా ఉంటాడు. ఎన్నో సందర్భాల్లో ఆయన తాను చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లకు వీరాభిమానిని అని చెప్పుకొచ్చేవాడు. తమ హీరోలను అభిమానించే డైరెక్టర్ నేడు పాన్ ఇండియా లెవెల్ లో టాప్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకడిగా కొనసాగడం పై చిరంజీవి,పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో గర్విస్తూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళిద్దరినీ అంతగా అభిమానించే సందీప్ వంగ, ఎందుకు వాళ్ళతో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. పవన్ కళ్యాణ్ అంటే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ గా ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు, ఇలాంటి పరిస్థితి లో భారీ గా డేట్స్ ఇచ్చే పరిస్థితులు లేవు కాబట్టి, ఆయనతో కుదరకపోయుండొచ్చు. కానీ చిరంజీవి తో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి?, ఆయన తన సమయాన్ని పూర్తిగా సినిమాలకే వెచ్చించాడు కదా అని అభిమానుల్లో మెలిగే ప్రశ్న.
అయితే త్వరలో సందీప్ ప్రభాస్ తో చేయబోతున్న స్పిరిట్ చిత్రం లో చిరంజీవి ని ప్రభాస్ కి తండ్రి క్యారక్టర్ కోసం రిక్వెస్ట్ చేసాడని, అందుకు చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా చేస్తే బాగుంటుందని పవన్ అభిమానులు సోషల్ మీడియా లో సందీప్ వంగ ని ట్యాగ్ చేసి ఎన్నో సందర్భాల్లో అడిగారు. అయితే గతం లో సందీప్ వంగ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలని ఉంది. ఆయన అప్పోయింట్మెంట్ కోరితే ఇస్తాడు, వెళ్లి కథ చెప్తాను, కానీ ఆ కథ ఆయనకు నచ్చకపోతే, వేరే కథ ని సిద్ధం చేయమని చెప్తాడేమో అని భయం వేస్తుంటాది. అందుకే ఇప్పటి వరకు కథ చెప్పే ప్రయత్నం చేయలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలకు సంబందించిన వీడియో ని క్రింద అందిస్తున్నాము చూడండి.
అయితే సందీప్ వంగ ఆలోచనలకూ తగ్గట్టుగా పవన్ ఆలోచనలు ఉండవు. సందీప్ ఆలోచనలు మొత్తం చాలా వైల్డ్ గా, రా & రస్టిక్ గా ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఉన్న స్థాయికి, సందీప్ వంగ లాంటి డైరెక్టర్ తో సినిమాలు చేస్తే కచ్చితంగా విమర్శలు ఒక రేంజ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో ఎప్పటికీ సినిమా వచ్చే అవకాశం లేదని విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ సందీప్ వంగ పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తే పవన్ ఆలోచనలకూ తగ్గట్టుగా ఉంటుంది. అలా అలవాటు లేని జానర్ లో సందీప్ సినిమా తీస్తే కచ్చితంగా ఫ్లాప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
He is waiting for the right time pic.twitter.com/yOZSMAL0Xi
— CHITRAMBHALARE (@chitrambhalareI) November 1, 2025