Baahubali The Epic : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇక పై రీ రిలీజ్ రికార్డ్స్ గురించి మాట్లాడుకోవాలంటే బాహుబలి(Bahubali : The Epic) తోనే మొదలు పెట్టాలి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి గర్వ కారణమైన బాహుబలి వల్ల, మన మార్కెట్ పాన్ ఇండియా ని దాటి, అంతర్జాతీయ స్థాయికి చేరుకొని, ఆస్కార్ అవార్డు ని కూడా ముద్దాడే రేంజ్ కి వెళ్ళాము. అలాంటి సినిమా రీ రిలీజ్ అవుతుందంటే ఈ మాత్రం రికార్డ్స్ రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి?. సరికొత్త సన్నివేశాలతో రెండు భాగాలను కలిపి, ‘బాహుబలి: ది ఎపిక్’ గా రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని స్క్రీన్ ఫార్మట్స్ ఉంటాయో, అన్ని స్క్రీన్ ఫార్మట్స్ కి ఈ చిత్రాన్ని కన్వెర్ట్ చేశారు. ఇది కదరా అసలు సిసలు రీ రిలీజ్ అంటే, రీ రిలీజ్ సినిమా అంటే స్టాండర్డ్స్ ఈ మాత్రం మైంటైన్ చెయ్యాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఇకపోతే రెండు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తమగు ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయి అనేది చూద్దాం. ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి రెండు రోజుల్లో 7 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి కోటి 60 లక్షలు,ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుండి 4 కోట్ల 75 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 13 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక నుండి 2 కోట్ల 25 లక్షలు, తమిళనాడు + కేరళ నుండి కోటి 25 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఓవర్సీస్ నుండి ఈ చిత్రానికి ఏకంగా 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఈ చిత్రానికి 30 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రోజుల వారీగా చూస్తే మొదటి రోజు 19 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, రెండవ రోజున 11 కోట్ల 10 లక్షల రూపాయిలు వచ్చాయి. ఒక రీ రిలీజ్ కి ఈ రేంజ్ గ్రాస్ రావడం అనేది ఈమధ్య కాలం లో ఎప్పుడూ జరగలేదు. ఫుల్ రన్ లో వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందా లేదా అనేది చూడాలి. బుక్ మై షో మరియు డిస్ట్రిక్ట్ యాప్స్ ని కలుపుకొని ఈ చిత్రానికి 6 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి అట.