Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)… ఆయన చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ (Kabeer Singh) పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమా 350 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. ఇక ఆ సినిమా తర్వాత రన్బీర్ కపూర్ తో ఆనిమల్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించింది. కానీ బాలీవుడ్ మాత్రం ఈ రెండు సినిమాల మీద విపరీతమైన కామెంట్లైతే చేశారు. ఇక సందీప్ రెడ్డి వంగ ను డి గ్రేడ్ చేస్తూ చాలా కామెంట్స్ కూడా చేశారు. కొంతమంది నటులు అయితే సందీప్ చేసిన కబీర్ సింగ్, అనిమల్ (Animal) సినిమాల్లో నటించకపోయి ఉంటే బాగుండేది అనే రేంజ్ లో మాట్లాడారు. మరి మొత్తానికైతే సందీప్ రెడ్డి వంగ ను బాలీవుడ్ మాఫియా కించపరచాలని చూసినప్పటికి ఆయన మాత్రం ప్రతి ఒక్కరికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తు వస్తున్నాడు.
Also Read : పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అయితే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందేనా..?
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ప్రభాస్ తో చేయబోతున్న స్పిరిట్ సినిమాతో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే ప్రయత్నమైతే చేస్తున్నాడట. ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. మరి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని ఎలా మెప్పిస్తాడు. తద్వారా ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది.
ఇప్పటికే స్పిరిట్ (Spirit) సినిమా స్టోరీ మొత్తాన్ని కంప్లీట్ చేసిన సందీప్ రెడ్డి వంగ కు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కూడా ఫినిష్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ఫౌజీ (Fouji) సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమా కోసం డేట్స్ ని కేటాయించే అవకాశాలైతే ఉన్నాయి.
ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన చాలావరకు ఉత్సాహం చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట సందీప్ రెడ్డివంగ నుంచి రాబోయే సినిమాలు భారీ విజయాలను సాధిస్తాయని ప్రతి ఒక్క అభిమాని కూడా కోరుకుంటుండటం విశేషం…
Also Read : వెండి తెరపై ‘డొక్కా సీతమ్మ’.. తెరకెక్కనున్న కీలక ఘట్టాలు!