https://oktelugu.com/

Balayya and Nagarjuna : ఈవెంట్స్ లో బాలయ్య ఉంటే నాగ్ ఉండడు…నాగార్జున ఉంటే బాలయ్య ఉండడు….వాళ్ల మధ్య ఏం జరిగింది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు అయినా చిరంజీవి(Chiranjeevi), నాగార్జున(Nagarjuna), బాలకృష్ణ(Balakrishna), వెంకటేష్(Venkatesh) లాంటి హీరోలు వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు.

Written By: , Updated On : February 6, 2025 / 01:28 PM IST
Balayya , Nagarjuna

Balayya , Nagarjuna

Follow us on

Balayya and Nagarjuna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు అయినా చిరంజీవి(Chiranjeevi), నాగార్జున(Nagarjuna), బాలకృష్ణ(Balakrishna), వెంకటేష్(Venkatesh) లాంటి హీరోలు వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీళ్ళు అందిస్తున్న సేవలు అంతా ఇంతా కాదు. వీళ్ళ వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకు సాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళు చేస్తున్న సినిమాలు సగటు ప్రేక్షకులను మెప్పించడంలో కీలకపాత్ర వహిస్తున్నారు… ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ నలుగురు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటూ ఉంటారు. అయితే సినిమాల్లో కలిసి నటించే అవకాశం అయితే లేదు. కానీ ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఈ నలుగురు కనిపిస్తే ఆయా హీరోల అభిమానులు సందడి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వజ్రోత్సవం వేడుకల్లో ఈ నలుగురు హీరోలు కలిసి ఒకే స్టేజి మీద సందడి చేశారు. ఇక అప్పుడు కలిసిన ఈ నలుగురు మరోసారి కలిసే అవకాశం అయితే రావడం లేదు. ఎందుకు అంటే నాగార్జునకు బాలకృష్ణకు మధ్య చిన్న వివాదాలు ఉండడంతో ఎప్పుడు చూసినా చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లేదంటే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లు మాత్రమే కనిపిస్తున్నారు. కానీ బాలయ్య నాగార్జున కలిసి మాత్రం కనిపించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య ఉంటే నాగార్జున ఉండడం లేదు. నాగార్జున వస్తే బాలయ్య రావడం లేదు.

మరి ఎందుకు వీళ్ల మధ్య ఇంత క్లాశేష్ వచ్చాయి అనే విషయం పెడితే సీనియర్ హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వీళ్ళు ఈ ఏజ్ లో ఇలాంటి ఇగో లకు పోవడం ఎందుకు అని మరి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు నాగార్జునకు కొద్ది సంవత్సరాల క్రితం చిన్న మనస్పర్థలు అయితే వచ్చాయి.

అవి ఏంటి అంటే నాగార్జున పిలిచిన ఒక ఈవెంట్ కి బాలయ్య బాబు రాలేదట. దానివల్ల నాగార్జున అతని మీద కోపంతో ఉండడమే కాకుండా ఆయనతో మాట్లాడడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నాగార్జున మాట్లాడకపోవడంతో బాలయ్య బాబు కూడా తనకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. వీళ్ళ మధ్య గొడవలైతే జరగలేదు.

కానీ చిన్న మనస్పర్ధలు వచ్చాయి ఇక అవే ఇప్పటివరకు కొనసాగుతూ రావడంతో వీళ్లిద్దరి మధ్య గ్యాప్ అయితే పెరుగుతుంది. మరి ఇప్పటికైనా గ్యాప్ తగ్గించుకొని ప్రేక్షకుల కోసం మరోసారి నలుగురు హీరోలు కలిసి స్టేజ్ మీద కనిపిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…