Sandeep Reddy: సందీప్ రెడ్డి వంగ కాన్ఫిడెంట్ చూస్తుంటే బాలీవుడ్ వాళ్ళకి నిద్ర పట్టడం లేదుగా…

సందీప్ ని ఎలాగైనా సరే తొక్కేయాలి అని చాలా వరకు ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆయన ఎంత అణచివేస్తే అంత పైకి ఎదుగుతా అనే రేంజ్ లో రణ్బీర్ కపూర్ తో 'అనిమల్ ' సినిమా చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్

Written By: Gopi, Updated On : April 13, 2024 1:04 pm

Sandeep Reddy Vanga about Spirit Movie

Follow us on

Sandeep Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న సందీప్ రెడ్డివంగా ఆ తర్వాత అదే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ కూడా 400 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాడు. ఇక సందీప్ రెడ్డి వంగ అంటే బాలీవుడ్ మాఫియాకు అర్థమైంది.

ఇక ఈ దెబ్బతో సందీప్ ని ఎలాగైనా సరే తొక్కేయాలి అని చాలా వరకు ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆయన ఎంత అణచివేస్తే అంత పైకి ఎదుగుతా అనే రేంజ్ లో రణ్బీర్ కపూర్ తో ‘అనిమల్ ‘ సినిమా చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా 900 కోట్ల వరకు కలెక్షను రాబట్టి గత సంవత్సరం సక్సెస్ సాధించిన సినిమాల్లో అతిపెద్ద సినిమాగా అనిమల్ సినిమాను నిలిపాడు. ఇక ఈ సినిమా తో డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కూడా భారీ సక్సెస్ సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా మొదటి రోజు 150 కోట్లకు పైన వసూళ్లను రాబడుతుందని ఒక బోల్డ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇక దాంతో బాలీవుడ్ మాఫియా కి నిద్ర పట్టడం లేదు. నిజానికి సందీప్ రెడ్డి వంగా అని గెలుకుతున్న బాలీవుడ్ మాఫియా మీద కసితో ఆయన సినిమాలు చేసి భారీ సక్సెస్ లు కొడుతున్నాడు. ఇక వాళ్ల మీద కసితోనే ఈ సినిమాని భారీ రేంజ్ లో మలచబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో 1000 కోట్లకు పైన వసూళ్లను రాబడుతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాతో సందీప్ మార్క్ యాక్షన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాడట…ఇక ఈయన ఇలానే సినిమాలు చేస్తూ వెలితే ఇండియన్ సినిమా ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో వన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతాడు…