https://oktelugu.com/

Sunroof Cars: కారుకు సన్ రూఫ్ కావాలని ఎందుకు ఎక్కువగా కోరుకుంటున్నారు? టాప్ 5 సన్ రూఫ్ కార్లు ఏవీ?

ఒక కారులో సన్ రూఫ్ చుట్టు పక్కల ఉండే విండోలతో పాటు పైన నుంచి కూడా వెలుతురు పడేలా అమరుస్తారు. దీనిని అవసరమైనప్పుడు ఓపెన్ చేసి, అవసరం లేనప్పడు మూసివేసే సౌకర్యం ఉంటుంది. డ్రైవర్ సన్ రూఫ్ స్విచ్ ను ఆన్ చేసినప్పుడు విండోలపై ఎలక్ట్రిక్ వలయం ఏర్పడుతుంది. ట్రాఫిక్ జాంలో ఉన్నప్పుడు, ఎక్కువగా కారును ఎండలో ఉంచాల్సినప్పుడు సన్ రూఫ్ ఉపయోగపడుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 13, 2024 / 01:03 PM IST

    sunroof cars

    Follow us on

    Sunroof Cars:  కారు కొనేటప్పుడు వినియోగదారులకు కొన్ని ప్రత్యేకమైన రిక్వైర్మెంట్స్ ఉంటాయి. తమకు సౌకర్యంగా ఉండేందుకు వినియోగదారులు కారుకు సంబంధించిన ఫీచర్లు, ఇంజిన్, ధర వంటి వాటి గురించి ఎక్కువగా తెలుసుకుంటారు. ఇటీవల ఎలక్ట్రిక్ సన్ రూప్ కార్ల గురించి తీవ్రంగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా వేసవిలో సన్ రూఫ్ ఉన్న కార్లు ఎక్కువగా విక్రయాలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక కారులో సన్ రూఫ్ ఎలా పనిచేస్తుంది? టాప్ సన్ రూఫ్ మోడళ్లు ఏవీ ఉన్నాయి? ఆ వివరాల్లోకి వెళితే..

    ఒక కారులో సన్ రూఫ్ చుట్టు పక్కల ఉండే విండోలతో పాటు పైన నుంచి కూడా వెలుతురు పడేలా అమరుస్తారు. దీనిని అవసరమైనప్పుడు ఓపెన్ చేసి, అవసరం లేనప్పడు మూసివేసే సౌకర్యం ఉంటుంది. డ్రైవర్ సన్ రూఫ్ స్విచ్ ను ఆన్ చేసినప్పుడు విండోలపై ఎలక్ట్రిక్ వలయం ఏర్పడుతుంది. ట్రాఫిక్ జాంలో ఉన్నప్పుడు, ఎక్కువగా కారును ఎండలో ఉంచాల్సినప్పుడు సన్ రూఫ్ ఉపయోగపడుతుంది. సన్ రూఫ్ ఉన్న కార్లలో వెంటిలేషన్ ఎక్కువగా ఉంటుంది.

    sunroof car1

    సన్ రూప్ సాధారణ కిటికీల కంటే ఎక్కువగా వెలుతురును ప్రసాదించి ప్రతికూల పీడనాన్ని వెళ్లగొడుతుంది. అంతేకాకుండా సన్ రూప్ ను ఆన్ చేసినప్పుడు క్యాబిన్ నుంచి వేడి గాలి బయటకు వెళ్తుంది. కార్లలో సన్ రూఫ్ సురక్షితమైనదేనని ఇన్సూరెన్స్ ఇనిస్ట్టిట్యూఫ్ ఫర్ హైవే సేప్టీ వంటి సంస్థ తేల్చారు. సాధారణ స్టీల్ రూఫ్ కంటే ఇవి ఎంతో ప్రయోజనాన్ని అందిస్తాయని తెలిపారు. అందువల్ల ఎక్కువ మంది వినియోగదారులు సన్ రూఫ్ ఉండే కార్లను కోరుకుంటున్నారు.

    మార్కెట్లో సన్ రూఫ్ కార్లు ఎక్కువగా వస్తున్నాయి. వీటిలో టాటా నెక్సాన్ టాప్ ప్లేసులో ఉంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు ఎలక్ట్రిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి సేప్ట పీచర్లు ఉన్నాయి. దీనిని రూ.8.15 లక్షల తో విక్రయిస్తున్నారు. ఆ తరువాత హ్యుందాయ్ ఎక్స్ టర్ లోనూ వాయిస్ ఎనేబుల్డ్ స్మార్ట్ సన్ రూప్ ఉంది. దీనిని రూ.6 లక్షల నుంచి రూ.10.15 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మూడో స్థానంలో టాటా పంచ్ ఉంది. ఇందులో వాయిస్ అసిస్టెడ్ సన్ రూప్ ఉంది. దీనిని రూ.10 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.