https://oktelugu.com/

Bank Loan: బ్యాంకు లోన్ ఈజీగా తీర్చాలనుకుంటున్నారా? ఈ టిప్స్ పాటించండి..

రుణాలు పూర్తి చేయాలంటే నెలనెలా ఈఎంఐ చెల్లించడం మాత్రమే కాదు. బోనస్ కింద వచ్చే కొంత మొత్తంతో చిన్న చిన్న రుణాలు క్లోజ్ చేయాలి. ఇలా లోన్లన్నీ పూర్తయిన తరువాత విలాసాల వస్తువులు కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : April 13, 2024 / 01:19 PM IST

    bank loan

    Follow us on

    Bank Loan:నేటి కాలంలో ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో కొన్ని అవసరాలు తీర్చడంతో పాటు డబ్బును సేవ్ చేయడం గగనంగా మారింది. ఈ క్రమంలో కొందరు తమ అవసరాలు తీరడానికి ముందుగానే నగదును అప్పు తీసుకొని నెలనెల చెల్లించే ఏర్పాటు చేసుకుంటారు. ఒకప్పుడు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకొని వడ్డీతో సహా చెల్లించేవారు. కానీ ఈమధ్య బ్యాంకులు వ్యక్తిగత రుణాలు ఇస్తున్నాయి. ఇల్లు, కారు కొనాలనుకున్నా లాంగ్ టర్మ్ లోన్లు ఇస్తున్నాయి. అయితే ఇవి తీసుకున్నప్పుడు బాగానే ఉన్నా.. చెల్లించేటప్పుడు ఆవేదన చెందుతారు. వీటిని ఈజీగా చెల్లించడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి పాటిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు.

    • ప్రతీ వ్యక్తి తమ అవసరాల రీత్యా ఎంతో కొంత అప్పు చేయకుండా ఉండలేరు. కానీ ఇది భారీ మొత్తంలో తీసుకున్నప్పుడు వాటిని చెల్లించేటప్పుడు బాధేస్తుంది. కారు, ఇల్లు కోసం తీసుకున్న బ్యాంకు లోన్ సంవత్సరాల తరబడి ఉంటుంది. నెలనెలా ఈఎంఐ రూపంలో వీటిని చెల్లిస్తున్నా.. అదనంగా ఖర్చులు రావడంతో ఒక్కోసారి ఆలస్యమై ఫైన్లు చెల్లిచాల్సిన పరిస్థితి ఏర్పడతుంది. అందువల్ల బ్యాంకు లోన్లు ఎక్కువగా తీసుకున్న వాళ్లు ఆర్థిక ప్రణాళిక ప్రకారంగా నడుచుకోవాలి.

     

    • బ్యాంక్ లోన్ తీర్చాలనుకునేవారు ముందుగా ఖర్చులను అదుపు చేయాలి. సాధారణంగా ప్రతీ ఇంట్లో ఇంటి రెంట్, కరెంట్ , ఫోన్ బిల్ తో పాటు సరుకులు తదితర నెలవారీ ఖర్చులు ఉంటాయి. అయితే వీటికి తోడు కొందరు జల్సాలకు అధికంగా వెచ్చిస్తారు. సంతోషంగా గడపడాన్ని ఎవరూ వద్దనరు కానీ ఆర్థిక భారం ఉన్నవాళ్లు అదనపు ఖర్చులను కంట్రోల్ చేయాలి. వచ్చే ఆదాయంలో 50 శాతం ఖర్చులకు పోను మిగతా 25 శాతం లోన్లు, మరో 25 శాతం సేవింగ్స్ కు కేటాయించుకోవాలి.

     

    • వ్యక్తిగత రుణాలతో పాటు కారు, ఇల్లు కోసం పలు రుణాలు తీసుకుంటారు. వీటిలో వేటికి ఎక్కువ వడ్డీ పడుతుందో తెలుసుకోవాలి. ఎక్కవ వడ్డీ ఉండే లోన్లను త్వరగా పూర్తి చేయాలి. అవసరమనుకుంటే బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకి వస్తే మరో లోన్ తీసుకున్నా పర్వాలేదు. ఇలా వడ్డీని తగ్గించుకుంటూ రావడం వల్ల అసలు తీర్చడం పెద్ద సమస్య కాదు. లేకుంటే వడ్డీలపై వడ్డీ భారం అధికంగా పడి ఎన్నిరోజులైనా లోన్లనూ పూర్తి చేయలేరు.

     

    • రుణాలు పూర్తి చేయాలంటే నెలనెలా ఈఎంఐ చెల్లించడం మాత్రమే కాదు. బోనస్ కింద వచ్చే కొంత మొత్తంతో చిన్న చిన్న రుణాలు క్లోజ్ చేయాలి. ఇలా లోన్లన్నీ పూర్తయిన తరువాత విలాసాల వస్తువులు కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. లోన్లు పూర్తి కాకముందు విలాసాల వస్తువులకు డబ్బు కేటాయిస్తే ఆదాయం సరిపోదు.