Sandeep Reddy : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశాలు వస్తాయి అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది సముద్రం లాంటిది. ఇక్కడ ఏ రోజు ఎవరు స్టార్ స్టేటస్ అనుభవిస్తారో లేదంటే ఎవరు పాతాళానికి పడిపోతారు అనేది క్లారిటీగా చెప్పలేము… ఇక కారణం ఏదైనా కూడా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగితే వాళ్లకి తప్పకుండా సక్సెసులైతే వస్తాయి. కాదని ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చేస్తే మాత్రం వాడు తొందరలోనే ఫేయిడ్ అవుట్ అయిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి (Arjun Reddy) లాంటి ఒక బోల్డ్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఏకైక దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga)… అనిమల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన ఆయన ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్పిరిట్ సినిమా దాదాపు 2026 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా కొంతమంది కొన్ని కామెంట్లైతే వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి సినిమా షూట్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిమీద సందీప్ రెడ్డివంగ ఒక క్లారిటీ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇదిలా ఉంటే అనిమల్ (Animal) సినిమాతో బాబి డియోల్ (Babi Deol) లాంటి ఒక స్టార్ హీరోని విలన్ గా పెట్టి అతనికి సెకండ్ ఇన్నింగ్స్ ని అందించిన సందీప్ రెడ్డి వంగని ఆయన చాలా గొప్పగా చూస్తున్నాడు.
ఇక రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో సందీప్ రెడ్డివంగ తనకంటే చాలా చిన్నవాడైనప్పటికీ బాబీ డియోల్ ఆయన కాళ్ళను కూడా మొక్కడానికి వచ్చాడు. మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డివంగా అనేవాడు తన కెరీర్ ను మార్చేశాడు అంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఉండడం మనం చాలా సందర్భాల్లో చూస్తూనే వస్తున్నాం…
హీరోగా ఒకప్పుడు రాణించిన ఆయన ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో చాలా సంవత్సరాల పాటు ఖాళీగా ఇంట్లోనే కూర్చున్నాడు. కానీ అనిమల్ సినిమాలో అబ్రార్ అనే క్యారెక్టర్ ని పోషించి తనదైన నటనను చూపించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టుకున్నాడు.
ఇక మొత్తానికైతే తెలుగు డైరెక్టర్ అయిన సందీప్ వంగ ఒక బాలీవుడ్ హీరో కి సక్సెస్ ను అందించడం తో ఆయన ఇప్పుడు సందీప్ ని దేవుడిలా చూడడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…