Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. మరి వాళ్ళు తమ ఇమేజ్ ను అంతకంతకు పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళ క్రేజ్ అనేది పెరుగుతుందా? లేదా అనేది మాత్రం వాళ్ళు చేసే సినిమాల మీదనే ఆధారపడి ఉంటుంది…ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరూ పాన్ ఇండియా బాట పట్టడం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే చాలామందికి పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆయన స్టార్ డమ్ అనేది ఆ రేంజ్ లో విస్తరించింది. ముఖ్యంగా ఆయనను అభిమానించే అభిమానులు పవన్ కళ్యాణ్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఆ సినిమా కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటిషన్ గా చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. మొదట ఆ సినిమాలను పూర్తి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమాని పూర్తి చేయాలని చూస్తున్న ఆయన ఆ తర్వాత ఓజీ (OG) సినిమాని కూడా తొందర్లో ఫినిష్ చేసి సినిమాని రిలీజ్ చేయాలనే ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు.
మరి ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఓజీ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసే విధంగా ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఓజీ సినిమాలో ఇంటర్వెల్ సీన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందట.
అది ఏంటి అంటే జనానికి అన్యాయం చేసిన పోలీస్ ఆఫీసర్ ను పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్ లోనే కొట్టి వాడి తల నరికి పోలీస్ స్టేషన్ నుంచి నుంచి బయటికి వస్తుంటారట. ఇక దాంతో ఇంటర్వెల్ పడుతుందని ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. మరి ఈ సీన్ కనుక ఇలాగే ఉన్నట్టయితే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందనేది మాత్రం చాలా క్లారిటీగా తెలుస్తుంది. మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేసి చూపించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా ఓజీ సినిమా చాలా బాగుంటుందని ఒక సందర్భంలో చెప్పడం వల్ల ఈ సినిమా మీద మంచి అంచనాలైతే పెరుగుతున్నాయి. ఇక దర్శకుడు సుజీత్ కూడా ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తుండటం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…