Sandeep Kishan-Sandeep Reddy Vanga : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు సందీప్ కిషన్. చూసేందుకు బాగుంటాడు, నటన కూడా బాగుంటుంది, కానీ సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోకపోవడం వల్ల ఇప్పటి వరకు ఆయన కెరీర్ లో రెండు మూడు హిట్స్ కి మించి లేవు. రీసెంట్ గా విడుదలైన ‘మజాకా’ చిత్రం సందీప్ కిషన్(Sundeep Kishan) కి 30 వ సినిమా. నేటి తరం స్టార్ హీరోలు కూడా ఇంత స్పీడ్ గా సినిమాలు చేయడం లేదు. చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతున్నా కూడా, సందీప్ కిషన్ కి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం. సందీప్ కిషన్ కెరీర్ లో కూడా కొన్ని మంచి సినిమాలు పడ్డాయి కానీ, అవి జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఉదాహరణకు ‘నగరం’ చిత్రం తీసుకుందాం. ఈ సినిమా ద్వారానే లోకేష్ కనకరాజ్(Lokesh Kanakaraj) డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు.
నేడు లోకేష్ కనకరాజ్ ఏ స్థాయిలో ఉన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా మిగిలాడు. కానీ అప్పట్లో లోకేష్ కి అవకాశాలు ఇచ్చిన హీరోలే లేరు. తాను రాసుకున్న స్క్రిప్ట్ పేపర్స్ ని పట్టుకొని దాదాపుగా అందరి స్టార్ హీరోల చుట్టూ తిరిగాడు, కానీ అవకాశం ఇచ్చింది సందీప్ కిషన్ మాత్రమే. కానీ సందీప్ కిషన్ అలాగే ఉండిపోయాడు, లోకేష్ కనకరాజ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇది కాసేపు పక్కన పెడితే సందీప్ కిషన్ అప్పట్లో ఒక క్రేజీ ఆఫర్ ని మిస్ చేసుకున్నాడు. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవరసం లేదు. ఈ చిత్రాన్ని అప్పట్లో సందీప్ వంగ ముందుగా శర్వానంద్ తో చేద్దాం అనుకున్నాడు, కానీ కుదర్లేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ తో కూడా చేద్దాం అనుకున్నాడు, కానీ ఆయన కూడా ఒప్పుకోలేదు.
Also Read :చిరంజీవి గారు అలా మాట్లాడడంతో నేను చాలా ఫీల్ అయ్యాను అంటూ హీరో సందీప్ కిషన్ షాకింగ్ కామెంట్స్!
ఇక ఆ సమయంలో సందీప్ వంగ(Sandeep Reddy Vanga) బుర్రలో కేవలం ఇద్దరు హీరోలు మాత్రమే మిగిలి ఉన్నారు. ఒకరు విజయ్ దేవరకొండ అయితే, మరొకరు సందీప్ కిషన్. ఒకరి తర్వాత ఒకరికి లుక్ టెస్ట్స్ చేసి ఆడిషన్స్ న కూడా చేద్దామని అనుకున్నాడట. ముందుగా విజయ్ దేవరకొండ కి లుక్ టెస్ట్ చేసారు. అతనికి లుక్ టెస్ట్ చేసిన తర్వాత సందీప్ వంగ కి ఇంకో ఛాయస్ కోసం చూడాల్సిన అవసరం రాలేదు. విజయ్ దేవరకొండనే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాతి హిస్టరీ మన అందరికీ తెలిసిందే. ఒకవేళ సందీప్ కిషన్ వరకు ఈ సినిమా కథ వెళ్లుంటే కచ్చితంగా ఆయన వేరే లెవెల్ లో ఉండేవాడు. కానీ అదృష్టం గడప వరకు వచ్చి తలుపు తట్టకుండానే వెళ్ళిపోయింది పాపం. భవిష్యత్తులో వీళ్ళ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశమే లేదు, ఎందుకంటే సందీప్ వంగ రేంజ్ ప్రస్తుతం ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు
Also Read :యానిమల్ లో అందుకే రణ్ బీర్ ను బట్టలిప్పి నిలబెట్టించాను : సందీప్ వంగా