Michael Teaser: టాలెంట్ ఫుల్లుగా ఉన్న అదృష్టం సరిగా కలిసిరాక ఇండస్ట్రీ లో బాగా వెనకబడిపోయిన హీరోలు ఎంతో మంది ఉన్నారు..అలాంటి హీరోలలో ఒకరు సుందీప్ కిషన్..ఈయన ఇప్పటి వరుకు చేసిన సినిమాలలో కేవలం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ఒక్కటే కమర్షియల్ గా సక్సెస్ సాధించింది..ఆ తర్వాత ఆయన నుండి వచ్చిన సినిమాలన్నీ ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలియని పరిస్థితి..కొన్ని సినిమాలకు పాజిటివ్ రివ్యూస్ వచ్చిన కూడా జనాల్లో సరిగా వెళ్లలేకపోయాయి..అయినా కానీ అలుపెరగకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు..అయితే ఈసారి కొద్దీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాన్ ఇండియా లెవెల్ లో చేస్తున్న చిత్రం ‘మైఖేల్’.

ఈ చిత్రం లో తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా ఒక ముఖ్య పాత్ర పోషించడం తో ప్రారంభం నుండి ఈ సినిమా పై ట్రేడ్ లో కాస్త బజ్ అయితే బాగానే ఏర్పడింది..ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు..కేవలం తెలుగుకి సంబంధించిన టీజర్ మాత్రమే కాకుండా, హిందీ, తమిళం మరియు మలయాళం భాషలకు సంబంధించిన టీజర్స్ ని కూడా విడుదల చేసారు.
ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది..సుందీప్ కిషన్ కెరీర్ కి ఈ చిత్రం కచ్చితంగా బూస్ట్ ఇస్తుందని ఈ టీజర్ ని చూస్తే అర్థం అయిపోతుంది..ముఖ్యంగా ఈ టీజర్ లోని డైలాగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది అనే చెప్పాలి..’వేటాడడం తెలియని జంతువులే..వేటాడే నోటికి చిక్కుతాయి’,’వెంటాడి ఆకలి తీర్చుకోవడానికి వేటాడాల్సిన పని లేదు సార్’ వంటి డైలాగ్స్ బాగా పేలాయి.

ఇక ఈ టీజర్ ని బట్టి చూస్తే ఇందులో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నట్టు అర్థం అవుతుంది..సుందీప్ కిషన్ మంచి యాక్షన్ హీరో గా ఈ సినిమాలో డైరెక్టర్ రంజిత్ జయకోడి చూపించాడు..రంజిత్ జయకోడి ఇప్పటి వరుకు తమిళం లో నాలుగు సినిమాలు చేసాడు..అందులో విజయ్ సేతుపతి తో ఆయన చేసిన ‘పురియాత పుతిర్’ అనే చిత్రం కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది..ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని హీరో సందీప్ కిషన్ బలంగా నమ్ముతున్నాడు..ఇక ఈ చిత్రం లో విజయ్ సేతుపతి తో పాటు యువ హీరో వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్ , వరలక్ష్మి శరత్ కుమార్ మరియు అనసూయ వంటి వారు కూడా నటిస్తున్నారు..చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తున్న ఈ టీజర్ ని చూస్తుంటే సందీప్ కిషన్ కెరీర్ లో బిగ్ హిట్ పక్కా అని అర్థం అవుతుంది..మరి టీజర్ కి తగ్గట్టుగానే , సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి.