Samyuktha Menon: సంయుక్త మీనన్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్…

సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ కొన్ని రకాల పాత్రలే చేస్తాను అంటే కుదరదు.అన్ని రకాల పాత్రలు పోషిస్తూ ఆ పాత్ర పరిమితిని బట్టి కొన్నిసార్లు గ్లామర్ షో కూడా చేయాల్సి ఉంటుంది.

Written By: Gopi, Updated On : December 19, 2023 5:43 pm

Samyuktha Menon

Follow us on

Samyuktha Menon: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు తమకంటూ పేరు ప్రఖ్యాతలు రావడానికి మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే అందులో భాగంగానే మలయాళ నటి అయిన సంయుక్త మీనన్ మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ లో మాత్రమే నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది. ఇప్పటికే ఈమె చేసిన భీమ్లా నాయక్, బింబిసారా,సార్, విరూపాక్ష లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఈమె ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో కూడా తను ఒక డీసెంట్ రోల్ లో నటించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకుంది.

ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ కొన్ని రకాల పాత్రలే చేస్తాను అంటే కుదరదు.అన్ని రకాల పాత్రలు పోషిస్తూ ఆ పాత్ర పరిమితిని బట్టి కొన్నిసార్లు గ్లామర్ షో కూడా చేయాల్సి ఉంటుంది. అలా వాటన్నింటికీ సిద్ధమైనప్పుడే హీరోయిన్లకు ఎక్కువ ఆఫర్లు వస్తాయి. అలాగే అభిమానుల నుంచి కూడా ఎక్కువ అభిమానం అనేది దక్కుతుంది.

ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఈమె కళ్యాణ్ రామ్ తో డెవిల్ అనే సినిమా చేస్తుంది. ఇది ఒక పిరియాడికల్ డ్రామా సినిమాగా తెరకెక్కించినట్టు గా కూడా ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఈ సినిమాలో ఆమె మరోసారి కళ్యాణ్ రామ్ పక్కన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో తను కొంచెం గ్లామర్ షో కూడా చేయబోతున్నట్టుగా ఈ సినిమా ట్రైలర్ ని చూస్తే మనకు అర్థం అయిపోతుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సంయుక్త మీనన్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి గ్రాండ్ ఫినాలే ఫైనల్ ఎపిసోడ్ కి వచ్చారు. అందులో ఆమె వేసుకున్న డ్రెస్సు గాని ఆమె చేసిన గ్లామర్ షో గాని ప్రస్తుతం నెట్టింట్ట హల్చల్ చేస్తుంది.

ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు ఇలా తను కూడా అభిమానుల్లో మంచి ఆదరణను సంపాదించుకోవడానికి జనల్ నోట్లో ఎప్పుడు తన పేరు వినబడేలా చూసుకుంటూ గ్లామర్ షో కి దిగుతున్నట్టుగా చెప్పకనే చెప్తుంది. ఇక ఈ సినిమాతో తనకు భారీ సక్సెస్ రావడం పక్క అంటూ ఇప్పటికే తను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక తన హాట్ ఫోటోల మీద మీరు కూడా ఒక కన్నెయ్యండి…