https://oktelugu.com/

Guess Actress: మెగా హీరోకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ హీరోయిన్ అప్పట్లో స్కూల్ టాపర్… ఎవరో గుర్తు పట్టారా?

తన అందం అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న యంగ్ హీరోయిన్ స్కూల్ టాపర్ అట. చదువుల్లో జెమ్ అట. మెగా హీరోకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆ హీరోయిన్ ఎవరో మీరు గుర్తు పట్టారా? చిన్నప్పుడు చదువుల్లో సత్తా చాటి ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ ని దున్నేస్తున్న ఆ హీరోయిన్ ఎవరంటే?

Written By:
  • S Reddy
  • , Updated On : August 27, 2024 / 12:48 PM IST

    Samyuktha Menon(1)

    Follow us on

    Guess Actress: హీరోయిన్ కావడం అంత సులభం కాదు. అందం, ప్రతిభతో పాటు తెలివితేటలు ఉండాలి. చిత్ర పరిశ్రమలో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. లౌక్యంగా వ్యవహరించాలి. దర్శకులు, హీరోలు, నిర్మాతలతో సత్సంబంధాలు మైంటైన్ చేయాలి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి. అందుకే ఇంటెలిజెంట్ గర్ల్స్ మాత్రమే ఇండస్ట్రీలో నెట్టుకు రాగలరు. పరిశ్రమలో నిలదొక్కుకుందంటే తెలివి గల అమ్మాయి అని నిర్థారించవచ్చు.

    పై ఫోటోలో కనిపిస్తున్న మలయాళ బ్యూటీ స్కూల్ టాపర్ అట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు సంయుక్త మీనన్. స్కూల్ డేస్ లో సంయుక్త మీనన్ మంచి మార్కులు తెచ్చుకుని వార్తల్లో నిలిచింది. ఆమె ఫోటో పేపర్లో వేశారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంయుక్త మీనన్ ప్రతిభను నెటిజెన్స్ కొనియాడుతున్నారు.

    Samyuktha Menon

    సంయుక్త 2016లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆమె మొదటి సినిమా పాప్ కార్న్. భీమ్లా నాయక్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ చిత్రంలో రానా భార్య పాత్రలో ఆమె కనిపించింది. ఇది పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర. అనంతరం బింబిసార చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ పట్టేసింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సూపర్ హిట్. బింబిసార సంయుక్త మీనన్ కి ఫేమ్ తెచ్చిపెట్టింది.

    అనంతరం ధనుష్ కి జంటగా సార్ మూవీ చేసింది. ఈ చిత్రం కూడా పాజిటివ్ టాక్ తో మంచి విజయం నమోదు చేసింది. ఇక సాయి ధరమ్ తేజ్ కి జంటగా నటించిన విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్. విరూపాక్ష సాయి ధరమ్ తేజ్ కమ్ బ్యాక్ మూవీ. ప్రమాదం కారణంగా ఆయన ఏడాదికి పైగా విశ్రాంతి తీసుకున్నాడు. హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన విరూపాక్ష పెద్ద మొత్తంలో లాభాలు పంచింది. వరుస విజయాలతో సంయుక్త మీనన్ లక్కీ హీరోయిన్ ట్యాగ్ సొంతం చేసుకుంది.

    కళ్యాణ్ రామ్ తో చేసిన రెండో చిత్రం డెవిల్ మాత్రం నిరాశ పరిచింది. డెవిల్ అంచనాలు అందుకోలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ పాన్ ఇండియా మూవీ ఉంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభు చిత్రంలో సంయుక్త మీనన్ నటిస్తుంది. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకుడు. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. అలాగే మలయాళంలో రామ్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది. సూపర్ హిట్స్ పడినప్పటికీ సంయుక్త మీనన్ స్టార్ కాలేకపోయింది…