Samyuktha Menon
Samyuktha Menon: రీసెంట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయమైనా హీరోయిన్స్ లో తక్కువ సమయం లోనే మంచి క్రేజ్ ని దక్కించుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్. ప్రస్తుతం ఈమె నిర్మాతల పాలిట బంగారం, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైనా సంయుక్త మీనన్, ఆ సినిమా నుండి మొన్న వచ్చిన ‘విరూపాక్ష’ వరకు చేసిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
ఇప్పుడు ఇండస్ట్రీ లో ఎలా అయ్యిపోయిందంటే సంయుక్త మీనన్ ఉంటే సినిమా సూపర్ హిట్ అన్నట్టే లెక్క, అలా అయిపోయింది. రీసెంట్ గా ‘విరూపాక్ష’ చిత్రం లో నెగటివ్ టచ్ ఉన్న క్యారక్టర్ లో తన నటవిశ్వరూపం చూపించి ప్రేక్షకులను బయపెట్టేసిన ఈ హాట్ బ్యూటీ పై టాలీవుడ్ స్టార్ హీరోల కన్ను కూడా పడింది. త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో సంయుక్త మీనన్ కి హీరోయిన్ ఛాన్స్ దక్కినట్టు సమాచారం.
కెరీర్ పరంగా ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఇప్పట్లో రాదు, అయితే క్రేజ్ పెరిగే కొద్దీ హీరోయిన్ పై రూమర్స్ కూడా పెరుగుతుంటాయని అందరూ అంటూ ఉంటారు.అలాగే సంయుక్త మీనన్ పై కూడా రీసెంట్ ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ ఉంది. అసలు విషయానికి వస్తే సంయుక్త మీనన్ రీసెంట్ గానే విడాకులు తీసుకున్న ఒక తమిళ హీరో తో ప్రేమాయణం నడుపుతుందని , ప్రస్తుతం ఆయనతో డేటింగ్ చేస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ హీరో తో ఆమె రీసెంట్ గానే ఒక సినిమా చేసి సూపర్ హిట్ ని అందుకుందని, ఈ సినిమా తోనే వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని అంటున్నారు. ఆ హీరో మరెవరో కాదు,ధనుష్ అని కూడా సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది. మరి ఈ రూమర్స్ పై సంయుక్త మీనన్ స్పందించి క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.
Recommended Video: