Adipurush Movie: 99 రూపాయలకే ‘ఆదిపురుష్’ చిత్రం..ఇంట్లో కూర్చొనే చూడొచ్చా..ఎలా?

ఇక ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా 50 రోజుల వరకు షేర్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కోలుకుంటున్న సమయం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ కి పెద్ద షాక్ ఇవ్వబోతుంది. అదేమిటి అంటే ఫైబర్ నెట్ ద్వారా కనెక్షన్స్ ఉన్న ప్రతీ ఇంటికి కేవలం 99 రూపాయిలు కడితే ఇంట్లో కూర్చొనే రిలీజ్ సినిమాలు చూసుకోవచ్చు.

Written By: Vicky, Updated On : May 31, 2023 1:22 pm

Adipurush Movie

Follow us on

Adipurush Movie: ఓటీటీ కారణం గా సినిమా ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే, కరోనా లాక్ డౌన్ సమయం లో జనాలు ఓటీటీ కి బాగా అలవాటు పడిపోయారు. అయితే కంటెంట్ బాగున్న సినిమాలు మాత్రం మినిమం 5 వారాలు మంచి వసూళ్లతో ఆడుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘విరూపాక్ష’ చిత్రం అందుకు ఉదాహరణ.గత ఏడాది #RRR ,కాంతారా , KGF చాప్టర్ 2 వంటి సినిమాలు కూడా నెల రోజుల వరకు హౌస్ ఫుల్ కలెక్షన్స్ ఆడాయి.

ఇక ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 50 రోజుల వరకు షేర్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కోలుకుంటున్న సమయం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ కి పెద్ద షాక్ ఇవ్వబోతుంది. అదేమిటి అంటే ఫైబర్ నెట్ ద్వారా కనెక్షన్స్ ఉన్న ప్రతీ ఇంటికి కేవలం 99 రూపాయిలు కడితే ఇంట్లో కూర్చొనే రిలీజ్ సినిమాలు చూసుకోవచ్చు.

జూన్ 2 వ తారీఖు నుండి ఈ విధానం ని ప్రారంభించబోతున్నారట ముఖ్యమంత్రి జగన్. అంతే కాదు త్వరలో విడుదల అవ్వబోతున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రం కూడా ఫైబర్ నెట్ ఉన్న వాళ్ళు 99 రూపాయలకే ఇంట్లో కూర్చొని చూడొచ్చు అట.జులై లో విడుదల అవ్వబోయే పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమాకి కూడా ఇదే గతి పట్టబోతున్నట్టు సమాచారం. అయితే దీనిపై కొంతమంది దర్శక నిర్మాతలు మరియు బయ్యర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

సినిమా థియేటర్స్ వ్యవస్థని కుప్పకూల్చే ఈ ప్రక్రియ ని ఏమాత్రం సామర్దించబోమని, మేము ఈ డీల్ కి ఊపుకోవట్లేదంటూ మొహం మీదనే చెప్పేస్తున్నారు. అయితే ‘ఏజెంట్’ లాంటి ఔట్పుట్ బాగాలేని సినిమాలు థియేటర్స్ లో విడుదల చేసుకోవడం కంటే , ఇందులో విడుదల చేసుకోవడం బెస్ట్ అని, ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.