Sampoornesh Babu Biryani Role: కొంతమంది నటులు వాళ్ళు చేసే క్యారెక్టర్లకి ప్రత్యేకమైన శైలిని జోడించి తమకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటారు. ఇండస్ట్రీలో ఎంతమంది నటులు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఎలాంటి డిఫరెంట్ పాత్రలనైనా పోషించడానికి సిద్ధంగా ఉంటారు. కొంత మంది మొదట కమెడియన్స్ గా సినిమాలు చేసినప్పటికి ఆ తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్లన్ని చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సునీల్ లాంటి నటుడు సైతం మొదట కామెడియన్ గా ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత హీరోగా మారి ప్రస్తుతం విలన్ పాత్రలను పోషిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘హృదయ కాలేయం’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంపూర్ణేర్ బాబు సైతం ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ లో నటించబోతున్నాడు.
ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు చేస్తున్న క్యారెక్టర్ కి నాని పోషిస్తున్న జడల్ క్యారెక్టర్ కి మధ్య గల సంబంధం ఏంటి అంటూ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరుగుతుంది. ఈ సినిమా నుంచి బిర్యాని అంటూ సంపూర్ణేష్ బాబు పోస్టర్ బయటికి రావడమే అన్నింటికి మూల కారణంగా మారింది. సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో ఒక కరుడుగట్టిన విలన్ గా నటించబోతున్నటుగా తెలుస్తోంది. నాని కి సంపూ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంటుందట.
కానీ అది అనుకోని కారణాలవల్ల శత్రుత్వంగా మారి ఫైనల్ గా సంపూ మంచి వ్యక్తిగా మారాడా? లేదా విలన్ గానే చనిపోయాడా? అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… శ్రీకాంత్ ఓదెల తన సినిమాలో విలన్ ను ఎలా చూపిస్తాడో మనందరికీ తెలిసిందే… దసర సినిమాలో విలన్ పాత్రకి చాలా ప్రత్యేకమైన ఐడెంటిటి ఉంటుంది.
ఇక ఈ సినిమాతో కూడా అలాంటి ఒక గుర్తింపు తెచ్చుకున్నట్లైతే మాత్రం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ సినిమా సంపూ కెరియర్ కి ఎంత వరకు ఉపయోగపడుతోంది అనేది…