Cauli Flower Moive: హృదయ కాలేయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఆ తర్వాత సింగం 123, కొబ్బరిమట్ట చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు ఈ హీరో. డిఫరెంట్ కామెడీ సినిమాలతో కొత్త ట్రెండ్ సృష్టించి తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. సంపూకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంది అని చెప్పాలి. ఒక పక్క హీరోగా కామెడీ సినిమాలు చేస్తూ మరో పక్క వేరే సినిమాల్లో గెస్ట్ రోల్స్, కమెడియన్ రోల్స్ చేస్తూ అలరిస్తున్నాడు. అప్పుడప్పుడు టీవీ కార్యక్రమాల్లోనూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్’ శీలో రక్షతి రక్షితః అన్నది ఉపశీర్షిక. ఈ మూవీ నుంచి సంపూ అభిమానులకు ఓ అప్డేట్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రా బృందం విడుదల చేసింది. ఎనీ టైమ్ శీలాన్నీ కాపాడే సింబల్ రా ఈ కాలీ ఫ్లవర్, శీలో రక్షిత రక్షితహ వంటి డైలోగ్ లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. మరోసారి తనదైన మార్క్ కామెడీతో అందర్నీ కడుపుబ్బ నవ్వించేందుకు సంపూ రేయద్య యినట్లు తెలుస్తుంది. ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంపూ సరసన వాసంతి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో గెటప్ శ్రీను, పోసాని కృష్ణ మురళి ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రజ్వల్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఎనీ టైమ్ శీలాన్ని కాపాడే సింబల్ యేరా ఈ కాలీఫ్లవర్!🕺
Here's our Burning Star @sampoornesh's bombarding tsunami Trailer of #Cauliflower 💥
Watch Here ⤵️
▶️https://t.co/cVFFguXYsT#RKMalineni #Prajwal #AshaJyothiGogineni #MadhuSudhanaCreations @adityamusic #RadhaKrishnaTalkies pic.twitter.com/yOs3BdsAFu— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 20, 2021