నటీనటులు : సంపూర్ణేష్ బాబు, సాయాజి షిండే, 30 ఇయర్స్ పృథ్వి, కత్తి మహేష్ తదితరులు..
దర్శకత్వం: వసంత నాగేశ్వరరావు
నిర్మాత : సంధిరెడ్డి శ్రీనివాసరావు
సంగీతం : ఎస్ఎస్ ఫ్యాక్టరీ
ఎడిటింగ్ : గౌతం రాజు
సినిమాటోగ్రాఫర్ : ఏ విజయ్ కుమార్
‘బజార్ రౌడీ'(Bazaar Rowdy)గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu). బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో మహేశ్వరి, లోరాని హీరోయిన్స్ గా వచ్చిన ఈ చిత్రానికి వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. సంధి రెడ్డి శ్రీనివాసరావు నిర్మాత. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూచూద్దాం.
కథ :
కాళీ (సంపూర్ణేష్ బాబు) తండ్రి (నాగినీడు) అతని పట్ల దురుసుగా ప్రవర్తిస్తాడు. అతన్ని ఎప్పుడు కొడుతూ ఉండేసరికి, చిన్న తనం నుంచి ఖాళీ అనేక సమస్యలను బాధలను ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో కాళీ తన తండ్రికి భయపడి ఇంటి నుండి పారిపోయి.. కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం.. ఒక బస్తీ వాళ్ల దగ్గర పెరుగుతాడు. వాళ్ళు కాళీని బజార్ రౌడీగా తయారు చేస్తారు. మరి రౌడీగా మారిన కాళీ జీవితం ఎలా సాగింది ? అతను తన తల్లిదండ్రులను ఎలా చూసుకున్నాడు ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ఈ సినిమా చూస్తున్నంతసేపు విసుగు వచ్చేస్తుంది. రొటీన్ సినిమా కావడం, పైగా ముందు జరగబోయే బాగోతం చాలా క్లారిటీగా అర్థం కావడంతో సినిమా బాగా బోర్ కొడుతుంది. అయినా సగటు ప్రేక్షకుడు.. సంపూర్ణేష్ బాబు నుండి కామెడీని, స్పూఫ్ లను ఆస్వాదిస్తాడు గాని, ఎమోషనల్ మెసేజ్ కాదు.
పైగా పాత సినిమాల వాసన ఈ సినిమా కథలో ఎక్కువై సరికి ఎక్కడా సినిమా అర్థవంతంగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ కేవలం సంపూర్ణేష్ బాబు ఎలివేషన్ సీన్స్ తోనే దర్శకుడు సినిమాని నింపేశాడు. మహేష్ బాబుకు కూడా ఈ ఎలివేషన్ సీన్స్ పెట్టరు. సంపూర్ణేష్ బాబు మీద ఇంత హంగామా చేయడం చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది.
దీనికి తోడు ఈ సినిమాలో చాలా సీన్స్ అత్యున్నతమైన చీప్ సన్నివేశాలుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాయి. అయితే, సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు, కాకపోతే నిర్మాత కష్టానికి ఏ మాత్రం విలువ లేకుండా పోయింది. ఇక సంగీతం చాలా అధ్వానంగా, ఆ మాటకొస్తే చాలా భయంకరంగా ఉంది. అలాగే సంపూ ధరించిన కాస్ట్యూమ్స్ వెగటు పుట్టిస్తాయి.
మొత్తమ్మీద నీరసం తెప్పించే సీన్స్, విసుగు మయంతో సాగే ఓవర్ బిల్డప్ షాట్స్, అర్ధం పర్ధం లేని కథాకథనాలు అన్నిటికీ మించి సంపూ విపరీత నటనా చాతుర్యం ప్రేక్షకుల హృదయాలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది.
ప్లస్ పాయింట్స్ :
కొన్ని కామెడీ సీన్స్,
నిర్మాణ విలువలు.
మైనస్ పాయింట్స్ ;
హీరో, అతగాడి యాక్టింగ్,
కథాకథనాలు,
సిల్లీ డ్రామా,
ఇంట్రెస్టింగ్ సాగని సీన్స్,
రెగ్యులర్ కంటెంట్,
రొటీన్ నేరేషన్,
నేపథ్య సంగీతం.
సినిమా చూడాలా ? వద్దా ?
నాసిరకమైన సీన్స్ తో, బాధ పెట్టే బోరింగ్ ప్లేతో మొత్తానికి ఈ సినిమా విసిగించింది. అయితే, సంపూ కామెడీని ఇష్టపడేవారు ఈ సినిమాని చూసి సంపూకి సపోర్ట్ చేస్తారేమో చూడాలి.
రేటింగ్ : 2 / 5