https://oktelugu.com/

Samantha: సమంత ‘యశోద’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి.. మొత్తం షూటింగ్​ ఎప్పుడు పూర్తవుతుందంటే?

Samantha: ప్రముఖ టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత కెరీర్​లో వేగం పెంచిన ఈ ముద్దుగుమ్మ భాషతో సంబంధం లేకుండా సినిమాలకు ఓకే చెప్తూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సమంత ప్రధాన పాత్రలో వస్తోన్న సినిమా యశోద. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ హరి – హరీష్ దర్శత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్​ మొదలుపెట్టగా.. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 25, 2021 / 03:36 PM IST
    Follow us on

    Samantha: ప్రముఖ టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత కెరీర్​లో వేగం పెంచిన ఈ ముద్దుగుమ్మ భాషతో సంబంధం లేకుండా సినిమాలకు ఓకే చెప్తూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సమంత ప్రధాన పాత్రలో వస్తోన్న సినిమా యశోద. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ హరి – హరీష్ దర్శత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్​ మొదలుపెట్టగా.. ఇప్పుడు ఆ షెడ్యూర్ కంప్లీట్ అయినట్లు నిర్మాత తెలిపారు.

    తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వివరించారు. వీటితో పాటు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏక కాలంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా, డిసెంబరు 6న యశోద సినిమా మొదలు పెట్టగా, ఈ రోజుతో ఫస్ట్ షెడ్యూర్ పూర్తి చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈషూటింగ్​లో సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మపై కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు పేర్కొన్నారు.

    జనవరి 3 నుంచి రెండో షెడ్యూర్ మొదలు పెట్టి.. 12వ తేదీ వరకు చేయనున్నట్లు వివరించారు. ఆ తర్వాత జనవరి 30 నుంచి నిర్విరామంగా షూటింగ్ చేసి సినిమాను కంప్లీట్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమాకు దర్శకుడు కొత్తవాడైనప్పటికీ.. చాలా క్లారిటీగా పని చేస్తున్నారని అన్నారు. ఖర్చు విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గట్లేదని తెలిపారు.