https://oktelugu.com/

Samantha: యూట్యూబ్ గ్లోబల్​ టాప్​100 మ్యూజిక్స్​లో.. ‘ఊ అంటావా మావ’ సాంగ్​ టాప్​

samantha: కళ్లు మూసి తెరిచే లోపే 2021 ముగింపుకు వచ్చేసింది. ఈ కరోనా ఎఫెక్ట్​తో అసలు రోజులు నెలలు తెలియకుండానే గడిచిపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరంలో జరిగిన ఘటనలన్నీ ఒక్కసారిగా నెమరువెసుకుంటుంటారు. కాగా, సినీ ప్రేక్షకులు కూడా ఈ ఏడాదిలో జరిగిన కొన్ని అద్భుతాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్​లో ఈ ఏడాది 100 పాపులర్​ సాంగ్​ లిస్ట్​ను విడుదల చేసింది. అయితే, ఇందులో సౌత్​ స్టార్ హిరోయిన్​ సాంగ్​ మొదటి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 27, 2021 1:31 pm
    samanthas-song-is-no-1-in-top-100-music-videos-global
    Follow us on

    samantha: కళ్లు మూసి తెరిచే లోపే 2021 ముగింపుకు వచ్చేసింది. ఈ కరోనా ఎఫెక్ట్​తో అసలు రోజులు నెలలు తెలియకుండానే గడిచిపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరంలో జరిగిన ఘటనలన్నీ ఒక్కసారిగా నెమరువెసుకుంటుంటారు. కాగా, సినీ ప్రేక్షకులు కూడా ఈ ఏడాదిలో జరిగిన కొన్ని అద్భుతాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్​లో ఈ ఏడాది 100 పాపులర్​ సాంగ్​ లిస్ట్​ను విడుదల చేసింది. అయితే, ఇందులో సౌత్​ స్టార్ హిరోయిన్​ సాంగ్​ మొదటి స్థానంలో ఉంది.

    Samantha

    Samantha

    ఇటీవలే స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. ఇందులో ఓ ఐటెం సాంగ్​లో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఊ అంటావా మావ.. ఊఊ ఆంటావా మావ అంటూ సాగే ఈ పాటకు సమంత ఇచ్చిన హాట్​ లూక్స్​.. వేసిన క్యూట్​ స్టెప్పులు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

    Also Read:  Jr Ntr: ఎన్టీఆర్​-కొరటాల కాంబో సినిమాలో హీరోయిన్​గా సామ్​?

     

    ఈ క్రమంలోనే విడుదలైన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్​లో దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. కాగా,  పుష్ప ఆల్బమ్​లోని శ్రీవల్ల సాంగ్​ 22వ స్థానంలో ఉండగా.. సామీ సామీ(తమిళం)25వ స్థానం, ఊ అంటావా(హిందీ)42వ స్థానంలో నిలిచి అంతా పుష్ప జాతరగా మార్చేసింది. ఇలా మొత్తానికి ఈ ఏడాది యూట్యూబ్​ స్టార్​గా పుష్ప నిలిచాడని చెప్పచ్చు. ఈ సూపర్​హిట్ ఆల్బమ్​కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.  సమంత తన కెరీర్​లో నటించిన తొలి ఐటెం సాంగ్​ ఇందే. మొదట్లో ఈ సాంగ్​కు నటించేందుకు సామ్ ఒప్పుకోలేదట.. ఆ తర్వాత సుకుమార్ దగ్గరుండి వివరించి మరి ఒప్పించారట. అలా ఈ అద్భుతాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు సామ్​. ఈ పాట పలు సందర్భాల్లో వివాదాస్పదమైనప్పటికీ.. ప్రేక్షకులు మాత్రం బాగా ఎంజాయ్​ చేస్తున్నారు.

    Also Read: OTT Round Up: ఈ వారం  ‘ఓటీటీ’  చిత్రాల పరిస్థితేంటి ?